Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ….

నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టులను నమోదు చేస్తాం: ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

 

తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలను,అనుమతి లేని నాసిరకం పురుగు మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలియజేసారు.తెలంగాణా ప్రభుత్వం నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై మరియు మాయ మాటలు చెప్పి రైతులకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు కొన్ని ఉత్తర్వులను జారీ చేసిందని పేర్కొన్నారు.ఇందులో భాగంగానే నకిలీ విత్తనాలను అమ్మేవారిపై మరియు సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేశామని వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో నకిలీ విత్తనాలను,నకిలీ పురుగు మందులను రైతులకు విక్రయించే 43 మంది వ్యక్తులపై 23 కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసారు.
రైతులు,అధికారిక విత్తన సరఫరా దారులు,విత్తన కంపెనీ ప్రతినిధులు మరియు సామాన్య ప్రజలు ఎవరికైనా జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాల్సిందిగా కోరారు.రైతులను మోసం చేస్తూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.ఇట్టి కార్యకలాపాలకు పాల్పడే నేరస్తులపై పీడీ యాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

24వ డివిజన్ లో ఉచిత అన్నపూర్ణ క్యాంటీన్ ఐదు రూపాయల భోజన పథకం కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ , స్థానిక కార్పొరేటర్

ఖమ్మం : కరోన విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధిలో శనివారం నాడు 24వ డివిజన్ కార్పోరేటర్ , టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు కమర్తపు మురళి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన పథకం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ పునకోల్లు నీరజా గారు పాల్గొని భోజనాలు పంపిణీ చేసారు . అనంతరం స్థానిక కార్పొరేటర్ ను డివిజన్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు . స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో పని చేసే మున్సిపాలిటీ కార్మికులకు , సిబ్బందికి మరియు నిరుపేదలకు సుమారుగా 100 మందికి ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రెహమాన్ , గౌరవ అధ్యక్షులు తాజుద్దీన్ , సహాయ కార్యదర్శి గోలి రామారావు , సూరపనేని శేషగిరి , యూత్ ప్రెసిడెంట్ మనోహర్ , అనీల్ , అస్లామ్ , వీరన్న , కోటీ , జిలానీ , డివిజన్ మహిళా అధ్యక్షురాలు రామలక్ష్మి , సెక్రటరీ నాగలక్ష్మి , ఆర్పీలు జాన్ బి , శ్రీదేవి , అంగన్ వాడీ టీచర్ విజయ , ఆశ వర్కర్ శశిరేఖ మరియు డివిజన్ కమిటీ తదితరులు పాల్గొన్నారు .

 

కరోనా ఇబ్బందులు పడుతున్న సెలవులు ఇవ్వడంలేదని ఖమ్మం ఆసుపత్రి సిబ్బంది నిరసన

జిల్లా ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో కరోనా ఇబ్బందులు పడుతున్న స్టాఫ్ సిబ్బంది..కరోనతో ఇబ్బందులు పడుతున్నా సెలవులు ఇవ్వలేదని ఆవేదన….కోవిడ్లో డ్యూటీ చేస్తున్న పట్టించుకోవడం లేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రభుత్వ నిబంధనలను పాటించని 10 ఆసుపత్రుల అనుమతులు రద్దు..

 

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ఖమ్మం నగరంలోని 10 ప్రవేటు ఆసుపత్రులకు కోవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు.

ఖమ్మం నగరంలోని ఆ ఆసుపత్రుల జాబితా:

  1. విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
  2. క్యూర్ హాస్పిటల్
  3. ప్రశాంతి హాస్పిటల్స్
  4. మార్వెల్ హిస్పిటల్
  5. జనని చిల్డ్రన్ హాస్పిటల్
  6. ఇండస్ హాస్పిటల్
  7. విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
  8. శ్రీ బాలాజీ చెస్ట్ మరియు డయాబేటాలాజి సెంటర్
  9. న్యూ హోప్ హాస్పిటల్
  10. సంకల్ప సి స్టార్ హాస్పిటల్

పైన తెలిపినటువంటి 10 ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ సేవలను అందించడంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు, అధిక ఫీజులు వసూలు చేసినట్లు బాధితుల నుండి పిర్యాదులు అందిన పిమ్మట, టాస్క్ ఫోర్స్ బృందం నిర్దారించినందున అట్టి హాస్పిటల్స్ కు జారీ చేయబడినటువంటి కోవిడ్ సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించవలసిందిగా ఒక ప్రకటనలో కోరారు.

 

ఖమ్మంలో అనుమతి లేని ప్రవేట్ ఆసుపత్రులపై దాడులు

 

ఖమ్మం నగరంలోని ప్రభుత్వ అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం అందిస్తున్న పలు ప్రైవేట్ హస్పిటల్స్ పై జిల్లా వైద్యాదికారి, సిబ్బందితో పాటు ముమ్మర తనికాలు నిర్వహించారు. ఆనరోగ్యంతో వచ్చినా వారి వద్ద నుండి ఆధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నరని, వైధ్యాధికారులు టాస్క్ ఫోర్స్ కలిసి నగరంలో ఆరోగ్య , విశ్వాస్ హాస్పిటల్లో ల్యాబ్ సీజ్ చేశారు, మార్వెల్ ఫార్మసీ సిజ్ చేశారు, శశి, క్యూర్, j. R ప్రసాద్ , RL, సూర్య, పలు ప్రయివేటు ఆసుపత్రిలను తనిఖీ చేశామని తెలిపారు జిల్లాలో అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం అందిస్తున్న ప్రవైట్ హాస్పిటల్స్ ను గుర్తించి కఠినమైన చర్యలు తిసుకుంటామని తెలిపారు… అన్ని ఆస్పత్రిలో ఫీజుల వివరాల పట్టిక లేకపోవడం గమనించారు,. వీరికి నోటీసులు అందజేశారు, కోవిడ్ నియమ నిబంధనలు ఫోటో కాల్ పాటించలేదని తెలిపారు, ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎడిషన్ ఏసిపి ట్రాన్స్పోర్ట్ రామాంజనేయులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేందర్ ప్రోగ్రాం అధికారి సుబ్బారావు, డాక్టర్ అలివేలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

 

 

నేలకొండపల్లి లో వ్యాధి నిరోదక శక్తి ని పెంపొందించే కషాయం తయారీ…

 

అవసరమున్న ప్రతి ఒక్కరికి ఉచిత పంపిణీ…

లిమ్రా క్లినిక్ ప్రవేట్ ప్రాక్టీషనర్ సోంద్…
కరోనా విస్తృత వ్యాప్తి నివారించేందుకు నేలకొండపల్లి గ్రామ పంచాయితీ ఎదురుగా ఉన్న లిమ్రా క్లినిక్ నందు వ్యాధి నిరోదక శక్తి ని పెంపొందించే కషాయాన్ని తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారు…

గత 16 సంవత్సరాలుగా తిరువూరు లో ఆయుర్వేద షాపు నిర్వహిస్తూ, ప్రాక్టీస్ చేస్తున్న తూము రమేష్ ఆధ్వర్యంలో 8 రకాల మూలికలతో (తిప్పతీగ, వేప మామిడి ఇగుళ్ళు, పంచతులసి, పసుపు, శోంఠి, మిర్యాలు, దాల్చిన చెక్క) తో తయారు చేసిన కషాయంను 9రోజుల పాటు అంధించనున్నట్లు ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ సోందు తెలిపారు…

ఈ కార్యక్రమాన్ని నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ రాయపూడి నవీన్, ఉపసర్పంచ్ లక్కం ఏడుకొండలు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు వాజిద్, బిజేపి మండలాధ్యక్షులు మన్నే కృష్ణ తో పాటు పలువురు వార్డు మెంబర్లు కలిసి ప్రారంభించారు

Related posts

జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి …

Ram Narayana

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్…ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన

Ram Narayana

Leave a Comment