Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రంగంలోకి ఈటల భార్య జమున …. కేసీఆర్ ప్రభత్వం పై మాటల తూటాలు

-మేము ఎలాంటి తప్పు చేయలేదు …భయపడే ప్రసక్తే లేదు
-46 ఎకరాలకంటే మాకు ఒక్క ఎకరం ఎక్కువ ఉన్న ముక్కు నెలకు రాస్తా
-అధికారులు అందుకు సిద్దమేనా ?
– కేసీఆర్ ఏదనుకుంటే అది రాత్రికి రాత్రి జ‌రిగిపోవాల‌న్న తీరుతో ఉన్నారు
-ఆత్మగౌరం కోసం ఆస్తులు అమ్మేయినా పోరాడతాం
-ఉద్యమంకోసం ఆస్తులు అమ్ముకున్నవాళ్ళం
-కేటీఆర్ పేపర్ కోసం భూములు తాకట్టు పెట్టాం
-ప్రజలకోసమే రేయింబవళ్ళు కష్టపడితే ఇదేనా మీరిచ్చే బహుమానం
-మా ఇంటి చుట్టూ పోలీసుల‌ను పెట్టారు
-ఎవరిని భయపెట్టడానికి ఇలా చేస్తున్నారు
-ఇంటెలిజన్స్ వాళ్లు కూడా ఉన్నారు
-గ‌తంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు
-మా హేచరీస్‌, గోదాములపై అసత్య ప్రచారాలు
-వాటిని ఎలా తిప్పికొట్టాలో తెలుసు
-మాసాయిపేటలో 46 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం

ఈటల రాజేందర్ భార్య జామున రంగంలోకి దిగారు . ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూల్ గా మాట్లాడుతూనే ప్రభుత్వంపై కేసీఆర్ పాలనపైన మాటల తూటాలు కురిపించారు …. తన భర్త రాజేందర్ పైన, తమ కుటుంబంపై కేసీఆర్ ప్రభుత్వం కక్ష గట్టి వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు . తాము ఎలాంటి తప్పు చేయలేదని … ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు …. తమపై భూకబ్జా చేశారని చేస్తున్న ఆరోపణలను వట్టి భూటకం అని ఆమె కొట్టి పారేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది అనుకుంటే అది జరగాలనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఇది న్యాయమా ? ధర్మమా ? మేము ఏమి నేరం చేశామని మా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టారు .నిత్యం ఇంటలిజెన్స్ వాళ్లతో నిఘా ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఎవరిని భయపెట్టడానికి త‌మ ఇంటి చుట్టూ పోలీసుల‌ను పెట్టార‌ని ఆమె నిల‌దీశారు. తాము దొంగతనం చేశామా? లేదా టెర్రరిస్టులమా? అని ఆమె నిప్పులు చెరిగారు .ఇంటెలిజన్స్ వాళ్లకు కూడా త‌మ ఇంటి వ‌ద్దే డ్యూటీ వేశారని ఇంత నిర్బంధమా?. త‌మ బంధువుల‌ను కూడా ప్రశ్నిస్తున్నారని ఆమె వాపోయారు. మనమేమన్న పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నామా ? ఇండియా లో ఉన్నామా ? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు .తెలంగాణ కోసమా కొట్లాడిన సందర్భంలో సమాఖ్య పాలకులు ఇదే ఇదంగా వ్యవహరిస్తే యూనివర్సిటీ లనుంచి విద్యార్థులు బయటకు వచ్చేవారా? ఉద్యమం జరిగేదా ? గతంలో ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి పరిస్థితి ఉందా?. ఇదేమి న్యాయం, ఒక్క వ్యక్తిని హననం చేసేందుకు ఇంత కుట్ర పూరితంగా వ్యవహరించటమా? అంటూ ఆమె కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు .తమకు 100 ల ఎకరాలు భూములు ఉన్నట్లు వాటిని కబ్జా చేసినట్లు చెబుతున్నారు . మాకు 46 ఎకరాల కన్నా ఒక్కఎకరం ఎక్కువభూమి ఉన్న తన ముక్కు నెలకు రాస్తానని ,సర్వే చేసిన అధికారులు అందుకు సిద్దమేనా ? అని ప్రశ్నించారు.

అధికారులు నివేదికలు ఇచ్చేముందు వావి వ‌ర‌స‌లు మ‌రిచి నివేదిక‌లు ఇవ్వడం ఏంటీ? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ హేచరీస్‌, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ వాటిని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుస‌ని చెప్పారు. మెదక్‌ జిల్లా మాసాయిపేటలో తాము 46 ఎకరాల భూమి కొనుగోలు చేశామ‌ని తెలిపారు. సర్వే చేసిన అధికారులు కూడా తాము నివేదిక స‌రైన రీతిలో స‌మ‌ర్పించ‌లేద‌ని తేలితే ముక్కు నేలకు రాస్తారా? అని ఆమె ప్ర‌శ్నించారు. త‌మ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయడం బాధాకరమ‌ని ఆమె చెప్పారు. తాము 1992లో దేవరయాంజల్‌ వచ్చామ‌ని, అనంత‌రం 1994లో అక్కడి భూములు కొన్నామ‌ని వివ‌రించారు. త‌మ‌ గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా త‌మ‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
తమ రెక్కల కష్టం మీద సంపాదించిన భూములు అమ్మియినా ఆత్మగౌరం కోసం కొట్లాడతామని ఇందులో వెనక్కి తగ్గే ప్రస్తకే లేదన్నారు .
కష్టానికి బహుమానమా….
తన భర్త రెండవసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారరం లోకి వచ్చినతరువాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించారు. కరోనా మహమ్మారి వచ్చింది ప్రజలకు దైర్యం చెప్పేందుకు నిరంతరం వారిమద్యనే ఉన్నారు .మేము వారించినా వినలేదు . రేయింబవళ్లు కష్టపడ్డారు .ఇంట్లో కూడా ప్రత్యేకమైన గదిలోనే ఐసోలేషన్ లాగా ఉన్నారు . నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించారు.12 మంది పియర్ఓ లను పెట్టి వారికీ కూడా హోటళ్లలో మకాం పెట్టించి కరోనా లో పని చేసేలా చేశారు.అందుకేనా ఈ బహుమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది .ఒక్కరికోసమో , కుటంబంలోని నాలుగురికోసం కాదని అన్నారు . కేసీఆర్ ఎదిరించేందుకు ఈటల భయపడుతున్నారా ? అని ప్రశ్నించగా చూద్దురుగాని ఎవరు భయపడుతున్నారో ఏమి జరుగుతుందో ? చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఎప్పుడు అన్యాయాన్ని అధర్మాన్ని సహించరాని చరిత్ర చెబుతుందన్నారు మీడియా సమావేశంలో సాధు కేశవరెడ్డి , సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు .

Related posts

నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవం..

Drukpadam

కేజ్రీవాల్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే… సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

గుజరాత్‌లో కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్‌తో దాడికి యత్నం!

Drukpadam

Leave a Comment