Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

క్యాబినెట్ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ ను అభినందించిన కేసీఆర్…

క్యాబినెట్ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ ను అభినందించిన కేసీఆర్…
-మంత్రిగా డైనమిక్ గా వ్యవహరిస్తున్నారంటూ ప్రసంశలు
-లాక్ డౌన్ వేల అజయ్ సేవలపై పొగడ్తలు
-ఇదే విధంగా వ్యవహరించాలని సూచన
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పనితీరును ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం సాక్షిగా అభినందించారు . మంత్రి అజయ్ డైనమిక్ వ్యవహరిస్తున్నారంటూ ప్రశంసించారు .లాక్ డౌన్ వేళ అజయ్ తనకు కరోనా వచ్చి కోలుకున్న తరువాత జిల్లాలో జెట్ స్పీడ్ తో వేగం పెంచారు . తాకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి పనితీరును పరిశీలించిన ముఖ్యమంత్రి అజయ్ ను మెచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ వేదికగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో లాక్ డౌన్ పొడిగించాలా ? వద్దా ? అనే విషయంపై మంత్రి అజయ్ కుమార్ అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందరభంగా ఆర్టీసీ ఉద్యోగులకు వాక్సినేషన్ కేటాయింపు & భద్రాద్రి జిల్లా కు మెడికల్ కాలేజి మంజూరు విషయంపై తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్యాబినెట్ సమావేశం సందర్భంగా ప్రగతి భవన్ లోమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లాక్ డోన్ అమలు వివరాలు మరియు వైద్య సేవలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ఆరా తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రజా అవసరాల కోసం కష్ట సమయాల్లో హుషారుగా పని చేస్తున్నారంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కేసీఆర్ కితాబు నిచ్చారు . తన క్యాబినెట్ లో సమర్థవంతమైన మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రి అంటూ క్యాబినెట్ సమావేశంలో అభినందనలు..

తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో జిల్లా వ్యాప్తంగా గణనీయంగా కరోణ కేసులు తగ్గాయని, లాక్ డౌన్ పొడిగింపు తో కరోణ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు థర్డ్ వేవ్ ప్రభావం కూడా ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన అభిప్రాయాన్ని తెలియజేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కోవిడ్ మృతదేహాలకు ఖమ్మంలోని బల్లెపల్లి వైకుంఠధామం నందు ఉచిత దహన సంస్కారాల నిర్వహించడం జరుగుతుందని, మరియు ఖమ్మం జిల్లాలో థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలో భాగంగా చిన్న పిల్లల కొరకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం, వైద్య సేవలకు సంబంధించిన వివిధ విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్కి క్యాబినెట్ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు

కరోనా కష్ట సమయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంజెక్షన్స పేరిట దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తుల పై ఉక్కుపాదం మోపి, జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఐటిసి వారితో ప్రత్యేకత చర్చలు చేసి ప్రతిరోజు 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను అందుబాటులోకి తెచ్చి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రవేట్ హాస్పిటల్ కి ప్రతిరోజు 1100 రేమిడీసివిర్ ఇంజక్షన్ లు అందుబాటులో ఉండే విధంగా సెక్షన్ చేయించి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన, ముందుచూపుతో చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం ఏర్పాటు విధానాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ప్రశంసలు కురిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ప్రజాసేవకుడు గా, సమర్థవంతమైన మంత్రిగా మీరు ఇలాగే మెలగాలంటు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు

ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట , పువ్వాడ ఫౌండేషన్ 2 .5 కోట్లతో 250 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ల

ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట , పువ్వాడ ఫౌండేషన్- ఖమ్మం కలిసి సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ల ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు . వాటిని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిని అభినందించారు . ఈ ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ల ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. అమెరికా నుండి ఈ కొత్త కాన్సన్ట్రేటర్ల ను దిగుమతి చేసే విషయంలో సునీల్ చావలి సహకరించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .

Related posts

తనతో సెల్ఫీ దిగాలంటే రూ.100 చెల్లించాలంటున్న మధ్యప్రదేశ్ మంత్రి…

Drukpadam

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…!

Drukpadam

ఛత్తీస్ గఢ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు….

Drukpadam

Leave a Comment