Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈసారి కూడా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా: హరీశ్ రావు

  • -రేపే హరీశ్ రావు పుట్టినరోజు
  • -వేడుకలకు సిద్ధమైన అభిమానులు
  • -కరోనా కారణంగా వేడుకలు వద్దని కోరిన హరీశ్

కరోనా నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. రేపు హరీశ్ రావు పుట్టినరోజు కావడంతో… వేడుకలను నిర్వహించేందుకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. అయితే ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని ఆయన కోరారు.

‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఞతలు’ అని హరీశ్ ట్వీట్ చేశారు.

Related posts

ప్రధాని టూర్ లో ఎం పి రాఘరామకు షాక్….

Drukpadam

భారత్ లో ఎంట్రీ ఇస్తున్న చైనా బైకులు!

Drukpadam

భూతలానికే తలమానికంగా యాదాద్రి ఆలయం…మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!

Drukpadam

Leave a Comment