Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే నోటిఫికేషన్లు ఇస్తారు :షర్మిల

మెద‌క్ జిల్లా చేర్యాల‌లో వైఎస్ ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌.. కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు
-ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఇటీవ‌ల యువ‌కుడి ఆత్మ‌హ‌త్య
-మృతుడి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ష‌ర్మిల
-ఇంకా ఎంత‌మంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ప్ర‌భుత్వం క‌ళ్లు తెరుస్తుంద‌ని ప్ర‌శ్న‌
-ప్ర‌జ‌ల‌కు తాను ఉన్నాన‌ని భ‌రోసా

మెద‌క్ జిల్లా వెల్దుర్తి మండ‌లం చేర్యాల‌లో వైఎస్ ష‌ర్మిల ప‌ర్య‌టిస్తున్నారు. ఉద్యోగం దొర‌క్క మ‌న‌స్తాపంతో మే 16న ఆత్మహత్య చేసుకున్న కొట్టము వెంకటేశ్ కుటుంబ స‌భ్యుల‌ను ఆమె ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ… తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఉద్య‌మ ల‌క్ష్యాల‌కు ద‌రిదాపుల్లో లేవని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ వ‌చ్చి ఏడేళ్లు గ‌డిచినా నిరుద్యోగులు చావే దిక్క‌ని అనుకుంటున్నార‌ని చెప్పారు. ఇంకా ఎంత‌మంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ప్ర‌భుత్వం క‌ళ్లు తెరుస్తుంద‌ని ఆమె నిల‌దీశారు.

 

ఇదే విష‌యంపై ఆమె ట్విట్ట‌ర్‌లోనూ స్పందించారు. ‘ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, ఉపాధి దొరక్క ఆత్మహత్య చేసుకున్న కొట్టము వెంకటేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, చేతికందిన కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాను. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దయచేసి ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. నేను మీ కోసం కొట్లాడుతా. మంచి రోజులు వస్తాయి’ అని ష‌ర్మిల చెప్పారు.

‘వెన్నుచూపని ధైర్యంతో, మొక్కవోని సంకల్పంతో పోరాడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్న రోజు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన రోజు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.

Related posts

కేంద్రం అనూహ్య నిర్ణయం…రిజూజీ నుంచి న్యాయశాఖ తొలగింపు …

Drukpadam

భారత సమగ్రతను ప్రశ్నించే శక్తులతో రాహుల్ కు సంబంధాలా?: బీజేపీ

Drukpadam

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ ముఖ్య నేతలకు బీజేపీ గాలం?

Drukpadam

Leave a Comment