Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రానున్న ఎన్నికలలో తుమ్మలా? తనయుడా ?

రానున్న ఎన్నికలలో తుమ్మలా? తనయుడా ?
సీనియర్ రాజకీయ నాయకుడు తుమ్మల ……… వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారా ? లేక ఆయన తనయుడు యుగంధర్ పోటీచేస్తాడా ?అనే చేర్చ నేడు ఖమ్మం జిల్లాలో నడుస్తుంది . తుమ్మల రాజకీయాలలో ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు . మరి కొన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసే సత్తా ఆయనుకు ఉంది . ఇటీవల ఆయన ఉరుకులు పరుగులు పెడుతున్నారు . గతంలో ఆయన నియోజక వర్గంలో అప్పుడప్పుడు మాత్రమే కనిపించేవారు . ఇప్పుడు తాను పోటీచేసి ఓడిపోయినా పాలేరు తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు . జనవరి మొదటి తేదీన గండుగులపల్లి లోని ఆయన స్వగృహానికి అభిమానులు పోటెత్తారు . ప్రత్యేకించి పాలేరునుంచి వేలాది మంది వచ్చి ఆయన్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు . ఆయన దగ్గరికి వచ్చిన అందరిని ఆయన పేరుపేరునా పలకరించారు . ఈ సందర్భంగా జై తుమ్మల అంటూ నినాదాలు కూడా చేయటం విశేషం . దీంతో ఇప్పటి వరకు ఆయన ఈసారి పోటీ చేయరని వస్తున్నా ఊహాగానాలకు పటాపంచలు అయ్యాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . ఆయనకు అత్యంత సన్నిహితులు ఆయనే ఈసారికూడా పోటీచేస్తారని అంటున్నారు . పాలేరులో ప్రజలు కూడా తుమ్మల ఉన్నప్పుడు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇప్పుడు ఏమాత్రం అభివృద్ధి లేదని వాపోతున్నారు . గత ఎన్నికలలో ఓట్లు వేయని వారు సైతం తుమ్మల విషయంలో పొరపాటు చేశామని పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారు . ఎన్నికలలో తుమ్మల ఓడిపోయిన తరువాత ఆయన తనయుడు యుగంధర్ నియోజకవర్గ ప్రజలతో నిత్యం సంభందాలు కొనసాగిస్తున్నారు . వారికీ ఏసమస్య వచ్చిన దాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు . ఏచిన్న కార్యక్రమం అయినా యుగంధర్ ప్రత్యక్షం అవుతున్నారు . టీ ఆర్ యస్ లో ఆయనకు ప్రాముఖ్యత తగ్గిందా అనే అనుమానాలు ఉన్నాయి . కెసిఆర్ ఆయనకు సన్నిహిత సంభందాలు ఉన్నందునే ఆపార్టీలో చేరారు . కెసిఆర్ కూడా జిల్లా నుంచి తుమ్మలకు ప్రాధాన్యత ఇచ్చి తన మంత్రి వర్గంలో చేర్చు కొని ఎమ్మెల్సీని చేశారు . తరువాత పాలేరు ఉపఎన్నికలలో అక్కడ పోటీచేయించారు . కెసిఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా , అంతకు ముందు తెలుగుదేశంలో మంత్రిగా జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వరావు ప్రస్తుతం తాను ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా తాను అధికారానికి దూరంగా ఉన్నారు . దీంతో అందరి చూపు తుమ్మల వైపే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయనకు అనుయాయులు ఉన్నారు . ఆయన బీజేపీలో చేరనున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై దీటుగానే ఆయన స్పందించారు . తనపై నిందారోపణలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయనే స్వయంగా పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు . కారణాలు సరిగా విశ్లేషించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు . ప్రస్తుతం ఆయన తన స్వగ్రామమైన గండుగులపల్లి లో వ్యవసాయం చేసుకుంటూ తన అనుయాయులు అభిమానులను తరుచు కలుస్తున్నారు . టీ ఆర్ యస్ లోనే ఉంటున్నప్పటికీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు . అప్పుడప్పుడు తుమ్మలకు తిరిగి మంత్రి పదవి వస్తుందని కేసీఆర్ స్వయంగా తుమ్మలను పిలిచారని , సోషల్ మీడియా లోను ప్రచార మాద్యమాలలోను వార్తులు విపరీతంగా వచ్చాయి వాటిని ఆయన ఖండించలేదు . పార్టీలోనూ , అధికారంలోను ఆయనకు ప్రాధాన్యత లేకపోటంపై ఆయన అభిమానులలో తీవ్ర అసంతృప్తి ఉంది . రాష్ట్రంలో రాజకీయాల్లో వస్తున్నా మార్పులు మరోమారు తుమ్మల రాజకీయ అడుగులపై , ఆయన భవిషత్తు పై చర్చకు దారితీస్తున్నాయి . ఆయన రాజకీయ అడుగులు ఏవిధంగా ఉంటాయి . ఈ సారి తాను కాకుండా తనయుడు యుగంధర్ బరిలో దించే ఆలోచన చేస్తారా లేదా తానే పోటీ చేస్తారా ? అనేది ఆశక్తి కరంగా మారింది ……

Related posts

ఏపీలో వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల నేత‌ల‌కి వెన్నుపోటే!… వైసీపీ రాజ్య‌స‌భ టికెట్ల‌పై అయ్య‌న్న వ్యాఖ్య‌!

Drukpadam

“కాంగ్రెస్’ను ట్విట్టర్ బయో నుంచి తీసేసిన హార్దిక్ పటేల్

Drukpadam

గత ఒప్పందాల ప్రకారమే ధాన్యం కొనుగోలు: కిషన్‌రెడ్డి

Drukpadam

Leave a Comment