Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టెట్ అభ్యర్థులకు తీపి కబురు.. ఉత్తీర్ణత ఇక జీవితకాలం చెల్లుబాటు!

టెట్ అభ్యర్థులకు తీపి కబురు.. ఉత్తీర్ణత ఇక జీవితకాలం చెల్లుబాటు!
-ఇప్పటి వరకు ఏడేళ్లుగా ఉన్న చెల్లుబాటు కాలం
-తాజాగా జీవితకాలానికి పెంచుతున్నట్టు ప్రకటించిన కేంద్రం
-టీచింగ్ వృత్తిని ఎంచుకున్న వారికి ఉద్యోగావకాశాల పెంపుకోసమేనన్న కేంద్రం

టెట్ అభ్యర్థులకు నిజంగా ఇది తీపి కబురే … గతంలో టెట్ రాస్తే దాని కాలపరిమితి కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది . కానీ ఇప్పడు ఒకసారి పరీక్షా రాస్తే జీవితాంతం ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది…..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసిన అభ్యర్థులకు ఇది తీపి కబురే. ఇందులో ఉత్తీర్ణత అయిన వారికి ఇచ్చే ధ్రువపత్రం ఇకపై జీవితకాలం చెల్లుబాటు కానుంది. ఇప్పటి వరకు దీని చెల్లుబాటు ఏడేళ్లు మాత్రమే కాగా, తాజాగా దీనిని జీవితకాలానికి పెంచుతున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. టెట్ ఉత్తీర్ణత చెల్లుబాటు కాలం ఏడేళ్లు మాత్రమేనంటూ 11 ఫిబ్రవరి 2011లో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీఈటీ) జారీ చేసిన ఆదేశాలను తాజాగా కేంద్రం పక్కనపెట్టింది.

అలాగే, ఇప్పటికే ఏడేళ్లు పూర్తయిన వారికి ధ్రువీకరణ పత్రాలను పునరుద్ధరించడమో, లేదంటే కొత్త పత్రాలు జారీ చేయడమో చేయాలని సూచించింది. టీచింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వారికి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది.

Related posts

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం …పార్టీకి నష్టం జరిగే అవకాశం !

Ram Narayana

కుటుంబాల మధ్య చిచ్చు గురించి జగన్ వ్యాఖ్యలపై షర్మిల స్పందన

Ram Narayana

ముందస్తు ముచ్చట… ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చా …?

Drukpadam

Leave a Comment