ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, పోస్టింగులు
-కృష్ణా జిల్లా కలెక్టర్ కు స్థాన చలనం
-మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్
-కృష్ణా జిల్లా కలెక్టర్ గా నివాస్
-ఇప్పటివరకు శ్రీకాకుళం కలెక్టర్ గా వ్యవహరించిన నివాస్
-పలు జిల్లాలకు హౌసింగ్ జేసీల నియామకం
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులకు బదిలీలు చేపట్టారు. పలువురికి కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన ఇంతియాజ్ అహ్మద్ ను బదిలీ చేశారు. ఆయనను మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా ఎల్ఎస్ బాలాజీరావును నియమించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి నియమించారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన గంధం చంద్రుడును గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ గా నియమించారు.
పాడేరు ఐటీడీవో పీవోగా గోపాలకృష్ణ రోణంకి, ప్రకాశం జిల్లా జేసీ (హౌసింగ్)గా కేఎస్ విశ్వనాథన్, కడప జిల్లా జేసీ (హౌసింగ్)గా ధ్యానచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జేసీ (హౌసింగ్)గా జాహ్నవి, కర్నూలు జిల్లా జేసీ (హౌసింగ్)గా ఎన్.మౌర్య, కృష్ణా జిల్లా జేసీ (హౌసింగ్)గా నుపుర్ అజయ్ కుమార్, గుంటూరు జిల్లా జేసీ (హౌసింగ్)గా అనుపమ అంజలి, నెల్లూరు జిల్లా జేసీ (హౌసింగ్) విదేహ కరే, చిత్తూరు జిల్లా జేసీ (హౌసింగ్)గా ఎస్.వెంకటేశ్వర్, పశ్చిమ గోదావరి జిల్లా జేసీ (హౌసింగ్)గా జీఎస్ ధనుంజయ్, విశాఖ జిల్లా జేసీ (హౌసింగ్)గా కల్పనా కుమారి, విజయనగరం జిల్లా జేసీ (హౌసింగ్)గా మయూర్ అశోక్, శ్రీకాకుళం జిల్లా జేసీ (హౌసింగ్)గా హిమాన్షు కౌశిక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అటు, సీఎం సలహాదారు, నవరత్నాల అమలు కమిటీ ఉపాధ్యక్షుడు ఎం.శామ్యూల్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు.