Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీపీసీసీ రేసు నుంచి తప్పుకున్న రేవంత్

టీపీసీసీ రేసు నుంచి తప్పుకున్న రేవంత్
ఇప్పుడే టీపీసీసీ కి అధ్యక్షుడిని మార్చవద్దు అంటున్న జానా
కొత్త పీసీసీ అధ్యక్షుడిగా జీవనరెడ్డి నా
కోమటిరెడ్డి కి హైకమెండ్ ఏమి ఆఫర్ చేయబోతుంది
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడు . అధిష్టానం టీపీసీసీ చీఫ్ గా ఎపిక చేస్తుందని అనుకున్నారు . ఆయనే తనకు పీసీసీ పీఠం కన్నా ప్రచార కమిటీ చైర్మన్ పదవే ముద్దు అంటున్నారు . అది అయితేనే తాను రాష్ట్రమంతా తిరిగే ఆవకాశం ఉందని తాను జనంలో తిరిగే పోస్టునే కోరుకుంటానని ఆయన తన అభిప్రాయాలను కొండబద్దలు కొట్టారు . అయితే ఇందులో ఏమైనా అంతరార్థం ఉందా? కావాలనే ఆయన ఆవిందంగా మాట్లాడుతున్నారా ? అనే సందేహాలు లేకపోలేదు . ఆయనకు పీసీసీ పదవి ఇవ్వద్దు అని అధిష్టానం వద్ద రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ వద్ద కొందరు పట్టుపట్టారు . వి .హనుమంతరావు ఒక అడుగు ముందుకేసి రేవంతరెడ్డి కి పీసీసీ పదవి ఇస్తే చాలామంది సీనియర్లు పార్టీ ని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు . చివరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై కూడా నిందారోపణలు చేశారు . గత నెలరోజులలుగా పీసీసీ చీఫ్ ఎవరనేదానిపై మీడియా లో రరకాల వార్తలు హల్చల్ చేశాయి . చివరకు కోమటి రెడ్డి వెంకటరెడ్డి లేదా రేవంత్ రెడ్డి అనే ప్రచారం తారాస్థాయిలో జరిగింది . రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చారని రేవంత్ రెడ్డిని ఈరోజో రేపో ప్రకటిస్తారని అనుకుంటున్నా సమయంలో రేవంతరెడ్డి బాంబు పేల్చారు . తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతల పై ఆశక్తి లేదన్నారు . ఒక మీడియా ఇంటర్వుయ్ లో తనకు పీసీసీ అధ్యక్షడు కన్నా ప్రచార కమిటీ చైర్మెన్ పదవినే ఇష్టమన్నారు . పీసీసీ చీఫ్ పదవి ఇబ్బందులతో కూడుకున్నదని అందరిని సమన్వయం చేయటం తలనొప్పితో కూడుకున్నదని అన్నారు . దీంతో ఆయన టీపీసీసీ చీఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్లైనది . ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఇస్తారా ?అంటే అదికూడా అనుమానంగానే ఉందనే అభిప్రాయాలూ ఉన్నాయి . మరి ఎవరు పీసీసీ చీఫ్ అంటే సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు చెపుతున్నారు . ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జీవనరెడ్డి పేరు దాదాపు ఖరారు అయిందనే ప్రచారం కూడా జరుగుతుంది . ఆయన అయితే వివాద రహితుడు . అందరిని కలుపుకొని పోయే వాడు అనే అభిప్రాయాలూ ఉన్నాయి . అందుకే జీవన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గుచూపింది అంటున్నారు . సీనియర్ నేత కుందూరు జానారెడ్డి మాత్రం పీసీసీ చీఫ్ నియామకం నాగార్జున సాగర్ ఉపఎన్నిక అయ్యేంతవరకు ఆపాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది . అయితే దాన్ని నిర్దారించటం లేదు . తాను అధిష్టానాన్ని కావలలేదని , తాను పీసీసీ చీఫ్ గురించి ఎవరిని సంప్రదించలేదని అంటున్నారు . పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రాజీనామా చేసిన అనంతరం నల్గొండ జిల్లా కు చెందిన భవనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ తనకే కావాలని పట్టు బట్టారు . దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తో కోమటిరెడ్డి వేంకటరెడ్డి కి సన్నిహిత సంభందాలు ఉండేవి . అందువల్ల ఆయన్ను పీసీసీ చీఫ్ గా చేస్తే వై యస్ అభిమానులు కాంగ్రెస్ కు అండగా ఉండే ఆవకాశాలు ఉండ వచ్చుననే అభిప్రాయాలూ కూడా వ్యక్తం అవుతున్నాయి . కోమటి రెడ్డి కి అధిష్టానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లోకి తీసుకొని ఆయన సేవలు ఉపయోగించు కోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది . అయితే కాంగ్రెస్ లో ఎప్పుడు ఏమి జరుగుతోందో ఎవరిని పీసీసీ చీఫ్ గా చేస్తారో మరికొన్ని రోజులు ఆగాల్సిందేనా ? లేక వెంటనే దీనికి ఫూలిష్ స్టాప్ పెట్టి పార్టీ మీద ఫోకస్ పెట్టి పార్టీ ని కాపాడు కొంటారో చూడాల్సిందే మరి !!!

Related posts

అజిత్ చర్యతో మేల్కొన్న శరద్ పవార్ …రాష్ట్ర వ్యాపిత పర్యటనకు సిద్ధం …

Drukpadam

ఏం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేసి ఇన్ని స్టేషన్లు తిప్పారు?: నారా లోకేశ్!

Drukpadam

టీఆర్ యస్ లో రసమయి మాటల కలకలం

Drukpadam

Leave a Comment