Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల అప్పుడలా …… ఇప్పుడిలా …….టీఆర్ఎస్ శ్రేణులు…….

ఈటల అప్పుడలా …… ఇప్పుడిలా …….టీఆర్ఎస్ శ్రేణులు
.ఈటల రాజేందర్ పాత వీడియోలు, ఆడియో క్లిప్పింగ్ లను వైరల్
.గతంలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన ఈటల
.ముదిరాజ్ ల తల్లి పాలు తాగి పెరిగారంటూ కితాబు
.ఏపీ ప్రజలు కూడా కేసీఆర్ లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య
ఈటలపై టీఆర్ యస్ శ్రేణులు మండి పడుతున్నాయి. ఆయన మంత్రిగా పార్టీలో ఉండగా ఒకమాదిరి …. లేకపోతె ఒక మాదిరిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నాయి. అందుకు ఆయన గతంలో మాట్లాడిన వీడియో లను వైరల్ చేస్తున్నాయి. ఆయన బీజేపీ లో చేరేందుకు సిద్దమైన వేళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ వైఖరిని వివరిస్తూ తూర్పార పట్టారు……… దీనిపై టీఆర్ యస్ ఘాటుగానే స్పందించింది. పార్టీలో ఉండగా ఆయన వెందుకు నోరుమెదపలేదని ప్రశ్నించింది. …..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ అనేది బానిసల నిలయమని విమర్శించారు. మంత్రులకు కూడా ఏ మాత్రం గౌరవం లేదని అన్నారు. టీఆర్ఎస్ అనేది కుటుంబ పార్టీ కాదని… ఎందరో త్యాగాల ఫలితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆయన ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి ఈటలపై విమర్శలు గుప్పించారు.

తాజాగా గతంలో కేసీఆర్ ను పొగుడుతూ, బీజేపీని విమర్శిస్తూ ఈటల రాజేందర్ మాట్లాడిన వీడియోలను, ఆడియో క్లిప్పింగులను టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ముదిరాజ్ ల తల్లి పాలను తాగి కేసీఆర్ పెరిగారని… ఆ ప్రేమతోనే ముదిరాజ్ ల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఓ వీడియోలో రాజేందర్ అన్నారు. తమకు కూడా ఒక కేసీఆర్ ఉంటే బాగుండని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. బీజేపీ భూస్థాపితం అవుతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆ వీడియోల్లో ఉన్నాయి.

అంతేకాదు, కేసీఆర్ బంధువు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ ను ఈటల పొగిడిన వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో సంతోష్ బయటకు తెలియనప్పటికీ, కేసీఆర్ కు వెన్నంటి ఉండి, అన్ని రకాలుగా సహకారం అందించారని ఈటల కొనియాడారు. గొప్ప షాక్ అబ్జార్బర్ గా సంతోష్ పని చేస్తున్నారని తాము అనుకుంటున్నామని చెప్పారు.

Related posts

కేసీఆర్ కు ఇదే ఆఖరి ప్రసంగం… రేవంత్ ఘాటు వ్యాఖ్యలు!

Drukpadam

హుజూరాబాద్ నుంచి ఈట‌ల భార్య పోటీ?.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌మున‌!

Drukpadam

తీహార్ జైలులో పెట్టినా సరే పోటీ చేస్తా.. గెలుస్తా: భూమా అఖిలప్రియ..!

Drukpadam

Leave a Comment