Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వ జి ఓ 239ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్…

ఏపీ ప్రభుత్వ జి ఓ 239ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్…

రాజధాని తరలింపుపై వాదనలు వినిపించేందుకు నిరంజన్‌రెడ్డికి రూ. 96 లక్షల రుసుము
ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధనకు జీవో 239 విరుద్ధమన్న పిటిషన్
హైకోర్టు న్యాయవాది విజయ్ కుమార్ తరపున పిటిషన్ దాఖలు

ఆంధప్రదేశ్ ప్రభుత్వం మే 24న జారీ చేసిన జీవో నంబరు 239ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని అమరావతి తరలింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డికి రూ. 96 లక్షలను ఫీజుగా చెల్లించేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. అయితే, ఇది ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43కి విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది చింతల విజయ్‌కుమార్ తరపున న్యాయవాది వై.కమలారాణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నిరంజన్‌రెడ్డి, ఏజీ ఎస్.శ్రీరామ్ సహా పలువురిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ జీవోను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి కొట్టివేయాలని, ఆ రూ. 96 లక్షలను వారి నుంచి రాబట్టాలని ఆ వ్యాజ్యంలో కోరారు.

రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి మార్చే శాసనాధికారం ప్రభుత్వానికి లేదంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి రిట్ పిటిషన్, హెబియస్ కార్పస్ రిట్‌ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసులు వాదించేందుకు నిరంజన్‌రెడ్డికి ఫీజు కింద రూ. 96 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 239ను జారీ చేసింది. ఈ జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 10న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Related posts

సీనియర్ పాత్రికేయులు అమర్ నాథ్ అంత్యక్రియలు

Drukpadam

తల్లాడ ,కామేపల్లి ,నేలకొండపల్లి మండలాల్లో డీసీసీబీ అధికారుల జులుం!

Drukpadam

విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయండి…తెలంగాణ నేతలకు రాహుల్ క్లాస్!

Drukpadam

Leave a Comment