Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేను పార్టీ పెట్ట‌లేదు..పార్టీ మార‌లేదు : ఈటల కొత్త స్వరం…

నేను పార్టీ పెట్ట‌లేదు..పార్టీ మార‌లేదు : ఈటల కొత్త స్వరం…
ఎన్నికలు వస్తేనే ప్రజలకు వరాలు కురిపిస్తారు మనముఖ్యమంత్రి
– వరాలు ప్రకటించడం మర్చిపోవడం ముఖ్యమంత్రి నైజం
-హుజురాబాద్ లో చాల సమస్యలు ఉన్నాయి తీర్చండి
– ఉప ఎన్నిక వ‌స్తుందంటే కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారు
-ఇప్పుడు హుజూరాబాద్‌లో మీకు ఓట్లు కావాలి
-కాబ‌ట్టి ఇప్ప‌టికైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలి

నేను పార్టీ పెట్ట‌లేదు..పార్టీ మార‌లేదు…. ఈటల కొత్త స్వరం …. నిన్నమొన్నటి వరకు బీజేపీ లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా ను కలిసి వచ్చారు. మరికొంతమందికి కూడా కలిశారు. ఇక్కడకు వచ్చి హుజురాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి 19 ఏళ్లగా టీఆర్ యస్ తో ఉన్న తన అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులతో ఎడతెరిపి లేని చర్చలు జరిపారు. ఇప్పుడు ఎందుకో నేను పార్టీ పెట్టడం లేదు … పార్టీ మారడం లేదని ప్రకటించారు. దీనిపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఈటెల బీజేపీ లో చేరికపై పునరాలోచనలో పడ్డారా ? అనే సందేహం కలుగుతుంది… దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది. ఆయనకు ఆయనగా తాను బీజేపీ లో చేరుతున్నట్టు చెప్పకపోవడం గమనార్హం ……

‘నేను పార్టీ పెట్ట‌లేదు.. పార్టీ మార‌లేదని’ ఈట‌ల అన్నారు. “ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు మాత్రం వ‌చ్చాను. ‘ఎవ‌రో అనామ‌కుడు ఇచ్చిన ఫిర్యాదు వ‌ల్ల నాపై వేటు వేశారు. త‌ప్పకుండా మీరు తవ్విన బొంద‌లో మీరే ప‌డ‌తారు. నేను ఎన్న‌డూ డబ్బులు ఇచ్చి గెల‌వ‌లేదు. మీరు డ‌బ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. అటువంటి ప‌నులు హుజూరాబాద్‌లో కొంద‌రు చెంచాగాళ్ల‌ను పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రేపు ఇక్క‌డ ఎన్నిక‌లు అంటే కురుక్షేత్ర యుద్ధం జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ న్యాయ‌యుద్ధం జ‌రుగుతుంది. హుజూరాబాద్ ప్ర‌జ‌లే ఇక్క‌డ గెలుస్తారు. మీ చిల్ల‌ర ప‌నుల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తే వాటికి ప్ర‌జ‌లు ప్ర‌భావితం కారు’ అని ఈట‌ల తీవ్ర స్వరంతో అన్నారు.

ముఖ్యమంత్రి పై ధ్వజం ….
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు వస్తేనే ప్రజల గురించి పట్టించుకుంటారు . వరాలు కురిపిస్తారు. వారి ముఖం చూస్తారు .లేకపోతె అసలు పట్టించుకోరు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్ వైఖరిపై ధ్వజమెత్తారు . హుజురాబాద్ లో కూడా రేపు జరగబోయేది అదే చూడండి అని అన్నారు. హుజారాబాద్ ప్రజల కష్టసుఖాలలో ఉన్న వ్యక్తిగా వారి బిడ్డగా చెబుతున్న ఇక్కడ ప్రజలు డబ్బులకు ,ప్రలోభాలకు లొంగరని అది రానున్న ఎన్నికల్లో నిరుపించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.
భ‌ర్త చ‌నిపోతే భార్య‌కు పింఛ‌ను రావాలని, కానీ రావ‌ట్లేద‌ని అన్నారు. పింఛ‌న్లు ఆగిపోయాయి అని ప్రజలు చెబుతున్న విషయాలను గుర్తు చేశారు . రెండున్న‌రేళ్లుగా కొత్త రేష‌న్ కార్డులు ఇవ్వ‌ట్లేద‌ని తెలిపారు. రాజీనామా త‌ర్వాత ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను నా దృష్టికి తీసుకొచ్చారు’ అని ఈట‌ల పేర్కొన్నారు.
హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తెల్ల రేష‌న్ కార్డులు, పింఛ‌న్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి. అదే విధంగా 58 ఏళ్లు నిండిన అంద‌రికీ పింఛ‌న్లు ఇవ్వాలి. 2018 ఎన్నిక‌ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఇవ్వండి. హుజూరాబాద్‌లో మీకు ఓట్లు కావాలి కాబ‌ట్టి ఇప్ప‌టికైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలి’ అని ఈట‌ల డిమాండ్ చేశారు.

‘వావిరాలను మండ‌లంగా చేయాల‌ని కోరాను. గ‌తంలో చ‌ల్లూరు మండ‌లం కావాల‌ని కోరాను. అలాగే, హుజూరాబాద్‌ను జిల్లా చేయాల‌ని కోరాను. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం. మా కోరిక మేర‌కు త‌క్ష‌ణ‌మే ఈ దిశ‌గా అడుగులు వేయాలి. మ‌న ముఖ్య‌మంత్రికి ఒక అల‌వాటు ఉంది. ఎప్పుడు ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా ఆ ని‌యోజక వ‌ర్గాల్లో వ‌రాల జ‌ల్లు కురిపించే అల‌వాటు ఉంది. కాబ‌ట్టి ఈ నియోజ‌క వ‌ర్గంలో కూడా మూల‌న ప‌డ్డ ప‌నులు జ‌రిగేలా నిధులు విడుద‌ల చేయాల‌ని అని ఈట‌ల డిమాండ్ చేశారు.

గొర్రెల మంద మీద తోడేళ్లు ప‌డ్డ‌ట్లు టీఆర్ఎస్ ప్ర‌వ‌ర్తిస్తోంది. ఎన్న‌డూ హుజూరాబాద్‌కు సాయం చేయ‌లేదు. ఇప్పుడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుందని చాలా మంది ప్ర‌భుత్వ‌ పెద్ద‌లు ఇక్క‌డికి వ‌స్తున్నారు. 18 ఏళ్లుగా న‌న్ను ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. ఇక్క‌డ కుటుంబ స‌భ్యులుగా బ‌తికిన మ‌మ్మ‌ల్ని విడ‌దీయాల‌ని చూస్తున్నారు’ అని ఈట‌ల విమర్శించారు.

‘స‌ర్పంచులు, ఎంపీటీసీలు, ఇత‌ర నేత‌ల‌ను, తనతో విడ‌దీయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వీట‌న్నింటినీ చూసి ప్ర‌జ‌లు, స్థానిక నాయకులూ బాధ‌ప‌డుతున్నారు. మేమంతా ఇక్క‌డ కాకులు దూర‌ని కార‌డ‌విలా, చీమ‌లు దూర‌ని చిట్ట‌డ‌విలా ఉంటున్నాం. ప్ర‌జ‌లు ఓట్లు వేసేది ప్ర‌జ‌ల మీద దాడి చేయ‌డానికి కాదు’ అని ఈట‌ల ఆవేశంగా అన్నారు.

 

Related posts

ఏపీ విభజనకు బీజేపీనే కారణం…సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

Drukpadam

మేఘాలయ గవర్నర్ కీలక వ్యాఖ్యలు…క్రియాశీల రాజకీయాలకు దూరం!

Drukpadam

ప్రధాని పదవికి గౌరవం ఉంది …దానికి మచ్చ తేవద్దు మోడీకి మాజీప్రధాని మన్మోహన్ చురకలు!

Drukpadam

Leave a Comment