Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో భారతీయులపై వివక్ష: తేల్చిన సర్వే….

అమెరికా భారతీయుల్లో వివక్ష: తేల్చిన సర్వే
– వివక్షకు గురిఅవుతున్నట్లు ప్రతి ఇద్దరిలో ఒకరి అభిప్రాయం
-తోటి భారతీయులతోనే వివాహాలు
-అమెరికాలోను భారతీయుల కులం మూలాలు
-3 అమెరికా యూనివర్సిటీలు కలిసి సర్వే
-అమెరికన్ భారతీయుల సామాజిక స్థితిగతులపై నివేదిక
ప్రపంచ అగ్రరాజ్యంగా గుర్తింపు పొంది ప్రజాస్వామ్యానికి రోల్ మోడల్ గా చెప్పుకుంటున్న అమెరికాలో సైతం వివక్ష కొనసాగడం ఆశ్చర్యకరమే …. జాతి వివక్ష నిషేదించబడినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది… అందులో ప్రత్యేకించి అమెరికా ఇండియన్స్ లో వివక్ష ఉందనేది ఇటవల జరిగిన ఒక సర్వే స్పష్టం చేస్తుంది. అందులో అనేక ఆశక్తికర విషయాలు వెలుగు చూశాయి. అమెరికాలో పౌరులుగా మరీనా భారతీయులు తమకుల మూలలను వదులుకోవడం లేదు … ఎక్కువమంది భారతీయులు తమ కులం వారినే ఇప్పటికి పెళ్లి చేసుకుందుకు ఇష్టపడుతున్నారు…….

అమెరికాలో చైనా తర్వాత ఎక్కువ మంది వలసదారులు భారతీయులే. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, సైన్స్, టెక్నాలజీ.. ఏ రంగం తీసుకున్నా వారి హవా ఎక్కువే. అలాంటి భారతీయులపై వివక్ష ఎక్కువవుతోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు జాతి వివక్ష లేదా మత వివక్షను ఎదుర్కొంటున్నారు. కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్ ఎస్ఏఐఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కలిసి గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే (ఐఏఏఎస్) చేశాయి.

ఆన్ లైన్ లో 1,200 మంది భారతీయుల అభిప్రాయాలను అధ్యయనకారులు తీసుకున్నారు. ఆ సర్వేకి సంబంధించి బుధవారం ‘భారతీయ అమెరికన్ల సామాజిక స్థితిగతులు’ పేరిట నివేదికను విడుదల చేశారు. ఏడాది కాలంగా అమెరికాలోని సగం మంది భారతీయులు వివక్షను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. ఆశ్చర్యకరంగా అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్లపైనే ఎక్కువ వివక్ష ఉంటోందని పరిశోధకులు గుర్తించారు.

ప్రతి పది మంది భారతీయుల్లో 8 మంది.. తోటి భారతీయులనే పెళ్లి చేసుకుంటున్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న మూడొంతుల మంది తమ జీవితాల్లో మతం చాలా కీలకమైందని తేల్చి చెప్పారు. హిందువుల్లో సగం మంది పేరుకు కులాన్ని కచ్చితంగా తగిలించుకుంటున్నారని గుర్తించారు.

అమెరికాలోని భారతీయులను ఇండియన్ అమెరికన్లు అని పిలుస్తున్నా.. అలా పిలవడం ఇష్టం లేదని 60 శాతం మంది పేర్కొన్నారు. కాగా, 2018 గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 42 లక్షల మందికిపైగా భారతీయులు నివసిస్తున్నారు.

Related posts

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో పిల్…..

Drukpadam

కేంద్రం రూ.1 కోటి నగదు పురస్కారాన్ని తిరస్కరించిన గీతాప్రెస్… ఎందుకంటే?

Drukpadam

అమ‌రావ‌తిపై ఏపీ హైకోర్టులో ప్ర‌భుత్వం అఫిడ‌విట్.. 

Drukpadam

Leave a Comment