Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి పలువురు నేతలు టీఎంసీ వైపు చూపు…

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి పలువురు నేతలు టీఎంసీ వైపు చూపు
-తిరిగి టీఎంసీలో చేరేందుకు సిద్దమవుతున్న ముకుల్ రాయ్ సహా 35 మంది బీజేపీ నేతలు!
-టీఎంసీ వైపు చూస్తున్న 35 మందిలో 20 మంది ఎమ్మెల్యేలు
-పార్టీ మారిన నేతలను రెండు కేటగిరీలుగా విభజించిన మమత
-మొదటి కేటగిరిలో ముకుల్ రాయ్.. రెండో దాంట్లో సువేందు
– బీజేపీకి గట్టి ఎదురు దెబ్బె అంటున్న పరిశీలకులు

బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు ఎన్నికల వేడి ఉండగా ఇప్పుడు పార్టీ మార్పు వేడి రాష్ట్ర రాజకీయాలు అతలాకుతలం చేస్తుంది. దీంతో తమకు ఓడినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్న బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బలు తగిలేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలు తిరిగి టీఎంసీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ సహా 35 మంది నేతలు ఉన్నట్టు సమాచారం. నాలుగేళ్ల క్రితమే బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ టీఎంసీవైపు చూస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీఎంసీ వైపు చూస్తున్న 35 మందిలో 20 మంది ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం.

పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్న వారు తిరిగి మమత కరుణా కటాక్షాల కోసం చూస్తున్నప్పటికీ ఆమె మాత్రం ఈ విషయంలో కొంత కఠినంగానే ఉండాలని, అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకోవడం లేదని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరెవరిని చేర్చుకోవాలనే దానిపై మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఓ ఫార్ములాను ఆమె సూచించారని చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలోకి రావాలనుకుంటున్న వారిని రెండు కేటగిరీలుగా విభజించారు.

పార్టీ మారినప్పటికీ మమతపై ఎలాంటి విమర్శలు చేయకుండా వివాదరహితులుగా ఉన్నవారు మొదటి కేటగిరీలోకి, పార్టీ మారాక మమతపై విరుచుకుపడిన వారు రెండో కేటగిరీలోకి వస్తారు. ఈ రకంగా చూసుకుంటే ముకుల్ రాయ్ మొదటి కేటగిరిలోకి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక తీవ్ర విమర్శలు చేసిన సువేందుకు అధికారి రెండో కేటగిరీలోకి వస్తారు.

మమతతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముకుల్ రాయ్ 2017లో బీజేపీ గూటికి చేరారు. అప్పటి నుంచి బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రతిపక్షంగా అవతరించిన తర్వాత తనను ప్రతిపక్ష నేతను చేస్తారని ముకుల్ రాయ్ భావించారు. అయితే ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీలో చేరిన సువేందుకు అధికారికి అధిష్ఠానం ఆ అవకాశం కల్పించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ముకుల్ రాయ్ ఇటీవల నిర్వహించి పార్టీ ముఖ్యనేతల సమావేశానికి కూడా హాజరు కాకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది.

Related posts

అమెరికాలో మొబైల్ లాక్కున్న టీచర్ పై పెప్పర్ స్ప్రేతో స్టూడెంట్ దాడి.. !

Drukpadam

ఎన్టీఆర్‌పై సీపీఐ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు!

Drukpadam

బండి సంజయ్ మిలీనియం మార్చ్ పై మండిపడ్డ హరీష్ రావు…

Drukpadam

Leave a Comment