సి జె ఐ పర్యటనపై తెలుగు దేశం స్పందన
-ఆయనకు కనీస గౌరవం ఇవ్వలేదన్న ఎమ్మెల్యే గోరంట్ల
-ప్రోటోకాల్ పాటించలేదని విమర్శ
తెలుగు రాష్ట్రాల పర్యటనలో సీజేఐ ఎన్వీ రమణ
తిరుమల నుంచి హైదరాబాద్ పయనం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పై టీడీపీ స్పందించింది. ఆయన కు కనీస గౌరవం ఇవ్వలేదని యధాప్రకారం విమర్శలు గుప్పించింది. ప్రోటోకాల్ పాటించలేదని ధ్వజమెత్తింది . దీనిపై తెలుగుదేశంకు చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.దీనిపై అధికార వైసీపీ ఘాటుగానే స్పందించింది. టీడీపీకి విమర్శలు చేయడం అలవాటుగా మారిందని పేర్కొన్నది .
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆపై హైదరాబాద్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. సీజేఐ ఎన్వీ రమణ తిరుపతి పర్యటనకు వస్తే ప్రభుత్వపరంగా కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించలేదని విమర్శించారు.
ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎంపిక అవ్వడం తెలుగుజాతికి గర్వకారణంగా చెప్పుకుంటుంటే, గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు వ్యవహరిస్తున్నారని గోరంట్ల విమర్శించారు. రాష్ట్రానికి సీజేఐ వచ్చిన వేళ… విపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు అనడం దుష్టరాజకీయానికి నిదర్శనం అని, ఇది సభ్యతేనా? ఇది ఆమోదయోగ్యమేనా జగన్? అని ప్రశ్నించారు.