Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉదయం 11 గంటలకు బీజేపీలోకి ఈటల.. సర్వం సిద్ధం!

ఉదయం 11 గంటలకు బీజేపీలోకి ఈటల.. సర్వం సిద్ధం!
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటల
బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం
రేపు తిరిగి హైదరాబాద్‌కు

బీజేపీ లో ఈటల చేరిక విషయంలో శేషభిషలకు తెరదించుతూ బీజేపీ లో చేరికకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు . ఉదయం 10 గంటలకల్లా బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని 11 గంటలకు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈటలతోపాటు అనేకమంది ప్రత్యేక విమానం లో ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈటల చేరిక కచ్చితంగా బీజేపీకి కొంత బలం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొంత కలం క్రితం టీఆర్ యస్ కు గుడ్ బై చెప్పిన ఈటల మూడు రోజుల క్రితమే ఎమ్మెల్యే పదివికి కూడా రాజీనామా చేశారు. అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో సమావేశమై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ ఛుగ్ తో సమావేశమైయ్యారు .
ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకుంటారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం అవుతారు

కాగా, తనతో కలిసి వస్తున్న నేతలతోపాటు బీజేపీ నాయకులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఈటల రాజేందర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. పార్టీలో చేరిక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు.

Related posts

ట్యాంక్‌ బండ్ పై వైఎస్ షర్మిల అరెస్ట్.. మౌన దీక్ష భగ్నం…

Drukpadam

అప్పుల ఊబి లో జగన్ సర్కార్ …క్షిణించిన ఆర్ధిక పరిస్థితి :ఉండవల్లి!

Drukpadam

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి …బీ ఫామ్ అందించిన వైఎస్ జ‌గ‌న్‌..

Drukpadam

Leave a Comment