Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా డెల్టా వేరియంట్‌లో మరో ఉత్పరివర్తన.. ‘డెల్టా ప్లస్’గా రూపాంతరం!

కరోనా డెల్టా వేరియంట్‌లో మరో ఉత్పరివర్తన.. ‘డెల్టా ప్లస్’గా రూపాంతరం!
-‘ఏఐ.1’గా పిలుస్తున్న శాస్త్రవేత్తలు
-మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్‌టెయిల్ చికిత్సకు లొంగని వేరియంట్
-ప్రపంచవ్యాప్తంగా 62 మందిలో కనిపించిన వేరియంట్
ఆందోళన అవసరం లేదంటున్నట్టు శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌లో మరో కొత్త రకం పుట్టుకొచ్చింది. ఇది రూపాంతరం చెందడం ద్వారా డెల్టా ప్లస్‌గా అవతారమెత్తింది. దీనినే ‘ఏవై.1’ అని కూడా పిలుస్తున్నారు. భారత్‌లో దీని ఉనికి చాలా తక్కువగానే ఉందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ వేరియంట్‌ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ చికిత్సకు లొంగకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభణకు కారణమైన బి.1.617 కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని డెల్టా వేరియంట్‌గా పిలుస్తోంది. ఇందులోని ‘కె417 ఎన్ వేరియంట్ మ్యుటేషన్ కారణంగా కొత్త వేరియంట్ అయిన ‘బి.1.617.2.1’ పురుడుపోసుకుంది.

వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో ఈ ఉత్పరివర్తన వచ్చినట్టు ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ఇప్పటి వరకు 62 మంది కొవిడ్ బాధితుల్లో కనిపించింది. ఈ నెల ఏడో తేదీ నాటికి భారత్‌లోనూ ఏడు నమూనాల్లో ఇది వెలుగుచూసింది. ఈ వేరియంట్ కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీలను ఇది తట్టుకుంటోందని తేలింది. అయితే, అంతమాత్రాన ఇది ఉద్ధృతంగా వ్యాపిస్తుందని కానీ, వ్యాధి తీవ్రంగా మారుతుందని కానీ చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌పై ఇంకా విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.

Related posts

ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది.. మూడో డోసు వేసుకోండి: ఆంటోనీ ఫౌచీ

Drukpadam

దండం పెట్టి చెపుతున్నా.. పుకార్లను మానుకోండి: కేసీఆర్!

Drukpadam

కోట్లు ఖర్చు చేసి కొవిడ్ కోచ్‌లుగా మార్చితే ఒక్కరూ ఎక్కని వైనం!

Drukpadam

Leave a Comment