Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖ భూకబ్జాలు …టీడీపీ పై అంబటి ఫైర్

విశాఖ భూకబ్జాలు …టీడీపీ పై అంబటి ఫైర్
-టీడీపీ వైసీపీ లమధ్య యుద్ధం లా మరీనా విశాఖ భూముల వ్యవహారం
-టీడీపీ నేతలు ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది
-చంద్రబాబు హయాంలో ఇష్టారాజ్యంగా లీజుకిచ్చారని వెల్లడి
-లీజు ముగిసినా తిష్టవేశారని ఆరోపణలు
-చర్యలు తీసుకుంటుంటే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం

విశాఖ భూముల వ్యవహారం వైసీపీ టీడీపీల మధ్య యుద్ధంలా మారింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎవరిది నిజమో ఎవరిదీ అబద్దమో తెలుసుకోలేక పోతున్నారు. వైసీపీ వాళ్ళు ఆక్రమాయించిన భూములు వదిలి తమ పార్టీ వారిపైనే దాడులు చేస్తున్నారని టీడీపీ ఆరోపణ … అది పాచి అబద్దమని వైసీపీ ఖండన … దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టారు ……

ఇటీవల విశాఖలో ఓ మానసిక దివ్యాంగుల పాఠశాలను ప్రభుత్వం కూల్చివేసిందంటూ తీవ్ర దుమారం రేగడం తెలిసిందే. కొన్నిరోజుల కిందట టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూముల అంశంపైనా వివాదం చెలరేగింది.

మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి చెందిన పాఠశాలను కూడా పడగొట్టేస్తున్నారంటూ తమ ప్రభుత్వంపై ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం ఎప్పటికీ అలా చెయ్యదని అన్నారు. కానీ, మానసిక దివ్యాంగుల పాఠశాలల పేరిట జరిగే దురాక్రమణలపై మాత్రమే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంబటి స్పష్టం చేశారు.

చంద్రబాబు హయాంలో విశాఖలోని అతి ఖరీదైన భూములను పప్పుబెల్లాల్లా లీజుకు ఇచ్చారని ఆరోపించారు. విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారని, భూ ఆక్రమణలకు పాల్పడిన వారి నుంచే తమ ప్రభుత్వం తిరిగి భూములను స్వాధీనం చేసుకుంటోందని వెల్లడించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములనే తాము స్వాధీనం చేసుకుంటుంటే, మీడియాలోని ఓ వర్గం గగ్గోలు పెడుతోందని విమర్శించారు. లీజులు ముగిసిన తర్వాత కూడా భూముల్లో తిష్ట వేస్తున్నవారిని ఏం చేయాలని అంబటి ప్రశ్నించారు.

నాడు చంద్రబాబు హయాంలో విశాఖలో భూకుంభకోణాలు జరిగితే, కొందరు ప్రజాప్రతినిధుల అండతోనే ఈ దందా నడుస్తోందని అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అనలేదా? అని అంబటి ప్రశ్నించారు. భూ కుంభకోణాలకు పాల్పడేవారిని తన్నడానికి కూడా విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నిజాలే చెబుతానని, అవసరమైతే తాను మంత్రి పదవి వదులుకోవడానికైనా సిద్ధమని చెప్పిన విషయాన్ని అయ్యన్న మర్చిపోయారా? అని నిలదీశారు.

Related posts

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ గంటకు పైగా భేటీ!

Drukpadam

అన్నా వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా: బండ్ల గణేశ్

Drukpadam

ఈ తీర్పు దురదృష్టకరం” సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి!

Drukpadam

Leave a Comment