Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం: విజయసాయిరెడ్డి….

విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం: విజయసాయిరెడ్డి
త్వరలోనే విశాఖకు రాజధాని అంటూ వ్యాఖ్యలు
ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని వెల్లడి
విశాఖలో 8 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం
ఒక్కో కన్వెన్షన్ సెంటర్ కు రూ.5 కోట్ల వ్యయం

విశాఖ రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమని వెల్లడించారు. ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ స్థాయికి తగిన విధంగా విశాఖలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

విశాఖలో మొత్తం 8 కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఒక్కో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రూ.5 కోట్ల వ్యయం చేయనున్నట్టు పేర్కొన్నారు. విశాఖలో తాగునీటి సమస్య లేకుండా రూ.500 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు. రాష్ట్రలో అభివృద్ధిలో విశాఖకు ప్రత్యేక స్తానం ఉందని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించునా విశాఖ పరిపాలన రాజధానిగా రావడం ఖాయమంన్నారు. దీనిలో రెండవ మాటకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకునేటప్పుడు ఆస్తులు గ్యారంటీలుగా చూపించడం సర్వసాధారణం అని అభిప్రాయపడ్డారు.

Related posts

కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం… ‘అపోహలు-వాస్తవాలు’ పేరిట ప్రకటన విడుదల!

Drukpadam

వద్దిరాజు రాజ్యసభకు @ ఏడాది …ఇనగుర్తి నుంచి అత్యన్నతి సభకు..

Drukpadam

కాంగ్రెస్ ఓట్లను చీల్చే పార్టీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి విసుర్లు!

Drukpadam

Leave a Comment