Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోనియా కరోనా వ్యాక్సిన్ రహస్యంగా ఎందుకు వేయించుకున్నారు :బీజేపీ…

సోనియా కరోనా వ్యాక్సిన్ రహస్యంగా ఎందుకు వేయించుకున్నారు :బీజేపీ
-రాయబరేలీ ప్రజల్ని సోనియా తమ కుటుంబ సభ్యులుగా భావించడం లేదా?
-వ్యాక్సిన్ పై కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారం చేసింది క‌దా?
-ఇప్ప‌టికైనా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునివ్వాలి
-సోనియా కరోనా టీకా పై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది ….సోనియా రాయబరేలి ప్రజలను మోసం -చేశారని నియోజకవర్గంలో ప్రజలు కరోనా తో అల్లాడుతుంటే ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు . -ఇప్పటికేనా ప్రజలు టీకాలు తీసుకోవాలని సోనియా పిలుపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవిషీల్డ్ రెండో డోసు కూడా తీసుకున్నారంటూ ఇటీవ‌లే కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. అది కూడా బీజేపీ అడిగితేనే చెప్పారు. దీనిపై ప‌లువురు బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. సొంత నియోజ‌క వ‌ర్గం రాయబరేలీ ప్రజల్ని సోనియా తమ కుటుంబ సభ్యులుగా భావించడం లేదా? అని కేంద్ర స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్ర‌శ్నించారు.

టీకాను ఎందుకు రహస్యంగా వేసుకున్నారని ఆయ‌న నిల‌దీశారు. రాయబరేలీని ఎందుకు విస్మరించార‌ని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా దీనిపై స్పందిస్తూ… వ్యాక్సిన్ పై కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు తప్పుడు ప్రచారాలు చేశాయ‌ని, ప్రజలను భయానికి గురిచేశాయని అన్నారు. ఇప్పుడు సోనియా మాత్రం వేయించుకున్నార‌ని చెప్పారు.

ఓటర్లను సొంత మనుషులుగా సోనియా ఎప్పుడూ భావించలేదని, రాజకీయ లాభాల కోసమే వారిని వినియోగించుకున్నారని మండిప‌డ్డారు. సోనియా గాంధీ రెండు డోసుల‌ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇప్ప‌టికైనా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రాయబరేలీ ప్రజలకు పిలుపునివ్వాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు.

 

Related posts

వైసీపీలో సుబ్బారావు గుప్త తలనొప్పి …మరో రఘరామ అంటున్న కార్యకర్తలు

Drukpadam

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే సింగరేణి కార్మికుల సమ్మె: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ధ్వజం …

Drukpadam

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నిక!

Drukpadam

Leave a Comment