ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కి అవమానం
– నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
– ఆయనకు అనుమతి లేదన్న పోలీసులు
-రెండుసార్లు ఇదే జరగటంతో ఎమ్మెల్యే మస్తాపం
-నిరసనగా నడుచుకుంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లాలో ఇవాళ కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కేసీఆర్ కలిసేందుకు బయల్దేరారు. దీంతో రెండు చోట్ల ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. దీంతో ఆయన తన కార్ వదిలి నడుచుకుంటూ వెళ్లి పోయారు .ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి టీఆర్ యస్ లో సైనికుడిగా పనిచేచ్సినా పెద్ది సుదర్శన్ రెడ్డికి అవమానం జరిగిన విషయం ముఖ్యమంత్రి వరకు చేరింది లేనిది ఇంకా నిర్దారణ కాలేదు ….
సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించారు. అయితే సీఎం వరంగల్ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా పాసులు జారీ చేసి మీడియా కవరేజ్‌కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై జర్నలిస్టులు సీరియస్‌గా ఉన్నారు. పోలీసులు తీరు సరికాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు నర్సంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సీఎం పర్యటన సంద్భంగా అవమానం జరిగింది.
హన్మకొండ మీదుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తున్న ఆయనకు అనుమతి లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దనే పోలీసులు నిలిపివేయడంతో మనస్థాపం చెందిన సుదర్శన్ రెడ్డి కారు దిగారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ నుంచి అర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు నడిచివెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా అధికార పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎం వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు ఏక శిలా పార్క్ వద్ద సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్లినా అనుమతి లేదని పోలీసులు మరోసారి ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపం సీచెందారు.