Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం దారుణం: బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం దారుణం: బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు
గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడు
సంపన్నులకు రైతుబంధు పథకం అవసరమా?
ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ఒక కమిషన్ ఏజెంట్

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కానీ అయన లాగా సంస్కారహీనంగా మాట్లాడటం తమకు కూడా తెలుసునని అన్నారు. రైతు బందు పథకం సంపన్నులకు అవసరం లేదన్న మాటకు కట్టుబడి ఉన్నామని .టాక్స్ పేయర్స్ కు , భూములు ఎక్కువగా ఉన్నవారికి రైతు బందు ఇవ్వడం దేనికని అన్నారు. ఇప్పటికే దీనిపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందని అన్నారు .పేద ప్రజలకు సహాయం చేస్తే అభ్యంతరం లేదు కాని ఉన్నవాళ్లకు ధనికులకు సహాయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం దారుణమని అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే (కేసీఆర్)ను దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి పాలైందని… ఆ భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయల్దేరుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయనే విషయం కేసీఆర్ కు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు .

రైతుబంధు పథకం, రైతు వేదికలు, వైకుంఠధామాలను విపక్షాలు వ్యతిరేకించడం లేదని… అయినప్పటికీ కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని రఘునందన్ అన్నారు. సర్పంచ్ లు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న దారుణ ఘటనలు కేసీఆర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. సంపన్నులకు కూడా రైతుబంధు ఇవ్వడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో ఇప్పటికే పంజాబ్ తొలి స్థానంలో ఉందని… ఈ విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెపుతున్నారని అన్నారు. కేసీఆర్ చెపుతున్నట్టు తెలంగాణ మొదటి స్థానంలో లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ఒక కమిషన్ ఏజెంట్ అని ఎద్దేవా చేశారు.

Related posts

కేంద్రం వద్ద మేం అడుక్కుంటున్నామా?… మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు?: ఏపీ మంత్రి పేర్ని నాని!

Drukpadam

శశిథరూర్ తో నన్ను పోల్చొద్దంటున్న మల్లికార్జున్ ఖర్గే!

Drukpadam

హైద్రాబాద్ మేయర్ సంచలన ప్రకటన …అది నిరూపిస్తే చెవి కోసుకుంటా!

Drukpadam

Leave a Comment