Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని రేసులో మోడీ, రాహుల్ మధ్యనే పోటీ…..

ప్రధాని రేసులో మోడీ, రాహుల్ మధ్యనే పోటీ…
-అందనంత దూరంలో వెనకబడ్డ రాహుల్
-ప్రధానిగా 32.8% మంది ఆయనకే ఓటు
-ప్రత్యామ్నాయంగా రాహుల్ కి 17.2% ఓట్లు
-15వ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్
-ఆయన్ను ఎంచుకున్న 0.7 శాతం మంది
-12 రాష్ట్రాల్లో 20 వేల మందిపై ప్రశ్నమ్ సర్వే

దేశంలో ఒక పక్క కరోనా గురించి ప్రజల్లో ఆందోళన ఉన్న మరో పక్క రాజకీయవేడి మాత్రం తగ్గడంలేదు …. కరోనా విజృభిస్తున్న వేళ ఎన్నికల నిర్వహణపై కేంద్రం పై విమర్శలు వెల్లు ఎత్తాయి… ప్రస్తుతం 2024 ఎన్నికలపై ఇప్పుడే చర్చలు ప్రారంభం అయ్యాయి. శరద్ పవార్ , యస్వంత్ సిన్హా లు నిర్వహించిన సమావేశంపై థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలు వస్తుండగా వారు దాన్ని కొట్టి పారేస్తున్నారు…. తమ మీటింగ్ కేవలం కరోనా వేళ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగంపైనే అని ,దేశంలో నెలకొన్న పరిస్థితులపై మాత్రమే ఇష్టాగోష్టిగా మాట్లాడు కున్నామని నిర్వహకులు అంటున్నారు….. అయితే ప్రశ్నమ్ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో దేశ ప్రధానిగా లేవవు కావాలని కోరుకుంటున్నారని 16 మండి పేర్లు ఇవ్వగా అందులో మోడీకి పోటీగా ప్రజలు రాహుల్ నే కోరుకోనంటున్నారు అనేది వెల్లడైంది . మిగతా వాళ్లలో శరద్ పవార్ , కేసీఆర్ లాంటి వారు ఉన్న వారికీ కేవలం 0.9 , 0 .7 మంది ప్రజలు మాత్రమే కురుకొంటున్నారని ఆ సంస్థ సర్వే సారాంశం ……

కేంద్రంలో బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా వేరే కూటమిని తీసుకొచ్చేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై నిన్ననే 8 పార్టీలతో బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ పార్టీపై చర్చించారు.

అయితే, ‘థర్డ్ ఫ్రంట్’ గురించి కాదని చెబుతున్నా చర్చ మొత్తం కేంద్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయంపైనే సాగింది. మరి, ఆ ‘థర్డ్ ఫ్రంట్’ గానీ, ప్రత్యామ్నాయ పార్టీగానీ బీజేపీ, మోదీ హవాను అడ్డుకుంటాయా? దీనిపైనే ప్రశ్నమ్ అనే సంస్థ సర్వే చేసింది. తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లోని 397 లోక్ సభ స్థానాలు, 2,309 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20 వేల మంది ఓటర్ల అభిప్రాయాలను తీసుకుంది.

అందులో ప్రధాని మోదీ హవా ఏమాత్రం తగ్గలేదు. 32.8 శాతం మంది మోదీనే తదుపరి ప్రధానిగా కోరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీకి ఓటేశారు. 17.2 శాతం మంది రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ఇక, ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే మమతా బెనర్జీకి 7 శాతం మంది, యోగి ఆదిత్యనాథ్ కు 6.1 శాతం మంది ప్రధానిగా ఓటేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను 0.7 శాతం మంది ఎన్నుకున్నారు. 16 మంది ప్రధాని అభ్యర్థుల జాబితాలో ఆయనది 15వ స్థానం.

అయితే, తదుపరి ప్రధానిగా ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో శరద్ పవార్ ఒకరు. ఆయన్ను కేవలం 0.9 శాతం మందే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. అమిత్ షాకు కూడా అంతగా ఆదరణ లభించలేదు. ఆయనకూ 0.9 శాతం ఓట్లే వచ్చాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్ లలో ఈ సర్వే చేశారు. సర్వే ప్రకారం ఇప్పటికీ ప్రధానిగా నరేంద్ర మోదీనే ఎక్కువ మంది కోరుకుంటున్నట్టు తేలింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ నిలిచారు.

Related posts

నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై కన్ఫ్యూజన్…

Drukpadam

ప్రియాంక విడుదలకు సిద్దు డిమాండ్ …విడుదల చేయకపోతే లాఖిమ్ పూర్ వరకు మార్చ్ !

Drukpadam

జ‌గ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌రు: భ‌ట్టి విక్ర‌మార్క‌…

Drukpadam

Leave a Comment