Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం…

ఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఇప్పటివరకు తీవ్ర చర్చనీయాంశంగా పరీక్షలు
ఏపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
మనసు మార్చుకున్న ఏపీ సర్కారు
సుప్రీంకోర్టు సూచనతో పరీక్షలు రద్దు
మార్కుల వెల్లడి కోసం హైపవర్ కమిటీ

ఏపీ ప్రభుత్వం బోర్డు పరీక్షల అంశంలో ఎట్టకేలకు మనసు మార్చుకుంది. సుప్రీంకోర్టు తీవ్ర స్పందన నేపథ్యంలో, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని చెప్పారు. అయితే, సుప్రీంకోర్టు సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, జులై 31 లోపే ఫలితాలు ప్రకటించడం ఆచరణలో కష్టమని అభిప్రాయపడ్డారు. టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధివిధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇతర బోర్డు పరీక్షల రద్దుతో మన విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఏపీలో పరీక్షలు రద్దు చేయడం సంతోషదాయకం: నారా లోకేశ్

సర్కారు నిర్ణయంపై లోకేశ్ స్పందన
రాష్ట్ర ప్రభుత్వ రాక్షస క్రీడ ముగిసిందని వ్యాఖ్య
విద్యార్థులను హింసించారన్న లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం పట్ల టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షసక్రీడ ముగిసిందని తెలిపారు. రెండు నెలల పోరాటం తర్వాత వైఎస్ జగన్ గారు దిగొచ్చి పరీక్షలు రద్దు చేయడం సంతోషం అని పేర్కొన్నారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

“మొండిపట్టుదలకు పోకుండా ఏప్రిల్ 18న నేను మొదటి లేఖ రాసినప్పుడే పరీక్షలు రద్దు చేసి ఉంటే విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఉండేది. మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదు… మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు” అని వ్యాఖ్యానించారు.

తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను హింసించారని లోకేశ్ విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంతో చీవాట్లు తినే పరిస్థితి మరోసారి తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని జగన్ ను
కోరుతున్నాను ట్విట్ చేశారు .

Related posts

స్టేషన్‌లో జారిపోయిన చెప్పు.. ప్రయాణికుడి ట్వీట్‌కు రైల్వే అధికారుల నుంచి ఊహించని స్పందన!

Drukpadam

సీనియర్ సిటిజన్స్‌కు టీటీడీ గుడ్ న్యూస్…

Ram Narayana

కోనసీమలో అదుపులోకి రాని మంటలు!

Drukpadam

Leave a Comment