Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లేని ఫ్రంట్ వ్యర్థం : శరద్ పవార్!

బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లేని ఫ్రంట్ వ్యర్థం : శరద్ పవార్!

-థర్డ్ ఫ్రంట్ పై ఆలోచనలు వట్టి పుకార్లే : పవార్
-ఇప్పటికి కాంగ్రెస్ బలమైన శక్తి అని వెల్లడి
-రాజకీయాల్లో కాంగ్రెస్ అవసరమని ఉద్ఘాటన
– బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో కాంగ్రెస్ ను విస్మరించలేమని పవార్ స్పష్టీకరణ

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ , ఫోర్త్ ఫ్రంట్ అనే వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో దీనికి మూలబిందువుగా ప్రచారంలో ఉన్న సీనియర్ నేత , మరాఠా యోధుడు శరద్ పవార్ స్పందించారు…… కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ సాధ్యం కాదని అలంటి ఫ్రంట్ ఏర్పాటు ఆలోచన వ్యర్థమని కుండబద్దలు కొట్టారు…. ఇటీవల ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన 8 పార్టీల సమావేశం పై కూడా ఆయన స్పందించారు….. ఈ సమావేశం కేవలం రాష్ట్ర మంచ్ నేత యస్వంత్ సిన్హా కోరిక మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో రాజకీయాలే కాకుండా కరోనా మహమ్మారి దేశంలో ఆర్ధిక పరిస్థిలులపై కూడా చర్చించినట్లు తెలిపారు.

ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో వరుస భేటీలు నిర్వహిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దేశ రాజకీయాల్లో కాక పుట్టించారు . వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు
ప్రశాంత్ కిశోర్ తో పవార్ భేటీలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో పవార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి .

దేశంలో బీజేపీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ చేయూత ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేసినా, కాంగ్రెస్ ను విస్మరించలేమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ లతో ఉపయోగంలేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. థర్డ్ ప్రంట్ ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారం పట్ల స్పందిస్తూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పటివరకు కూటమి గురించి తమ సమావేశాల్లో చర్చకు రాలేదని, ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడితే అందులోకి కాంగ్రెస్ ను తీసుకోవడం తథ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వంటి బలీయమైన శక్తి రాజకీయాల్లో అవసరమని పవార్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏ ఫ్రంట్ రూపుదిద్దుకున్నా సమష్టి నాయకత్వం ఉండాలని అన్నారు. ఒకవేళ మీరు ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ… “శరద్ పవార్ గతంలో ఇలాంటివి చాలాసార్లు ప్రయత్నించి చూశారు” అంటూ చమత్కరించారు.

Related posts

షర్మిల పాలేరులో పోటీపై మనసు మార్చుకున్నారా… ?

Drukpadam

జలవివాదంపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు…

Drukpadam

బద్వేల్ ఉపఎన్నికలో చేతులెత్తేసిన పవర్ స్టార్…

Drukpadam

Leave a Comment