Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జపాన్ లో పనిదినాలు వారానికి నాలుగు రోజులే… ప్రభుత్వం కీలక సిఫారసులు…

జపాన్ లో పనిదినాలు వారానికి నాలుగు రోజులే… ప్రభుత్వం కీలక సిఫారసులు..
-ప్రజల జీవనశైలిలో మార్పుకు సర్కారు ప్రయత్నం
-ఉద్యోగులు ఉత్తేజంతో పనిచేస్తారని భావన
-వివాహాలు పెరుగుతాయని ఆలోచన
-తద్వారా జనాభా పెరుగుతుందని అంచనా
-అసలే లేబర్ సమస్య …పని దినాలు తగ్గితే మరింత నష్టమని హెచ్చరిక
-దీనికి కంపెనీ లు ఒప్పుకొంటాయో లేదో అనే అనుమానం

జపాన్ ప్రభుత్వం వారంలో నాలుగు రోజుల పనిదినాల అమలు చేయాలనీ వివిధ కంపెనీలకు సిఫారసులు చేసింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది…. జపాన్లో జనాభా పెరుగుదల నిలిచిపోయింది . యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు…. ఆర్థిక వ్యవస్థ సరిగాలేదు …. దీనికి కారణం …. ఉద్యోగులు కార్మికులకు సరైన సమయం దొరకటంలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి…. అందువల్ల వారికే కావలసిన మానసిక ఉల్లాసం కలిగించేందుకు నాలుగు రోజులు పనిదినాల వల్ల మూడు రోజులు ఖాళీ దొరికి సరదాలకు ,షికార్లకు ఉపయోగ పడుతుందని ప్రభుత్వ ఆలోచన … కాని కొంత మంది నిపుణులు పారిశ్రామిక వేత్తలు దీని తప్పు పడుతున్నారు. దీనివల్ల లేబర్ సమస్య ఏర్పడుతుందని , ఆర్థిక సమస్య మరింత దిగజారుతుందనని ఆందోలన వ్యక్తం చేస్తున్నారు…..

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రయివేటు కంపెనీలు వారానికి ఐదు రోజులే పనిదినాలుగా అమలు చేయడం తెలిసిందే. అయితే, జపాన్ ప్రభుత్వం సంచలనాత్మక రీతిలో వారానికి నాలుగు రోజులే పనిదినాలు అంటూ కీలక సిఫారసులు చేసింది. కుటుంబం, ఉద్యోగం మధ్య వ్యక్తులు సమతుల్యత సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. జనాభా పెరుగుదల లేకపోవడం జపాన్ లో ఓ సమస్య. అధిక పనిగంటల ఒత్తిడితో కుటుంబ సభ్యులు కలుసుకునే సమయం తగ్గిపోతోందని జపాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నాలుగు రోజుల పనిదినాలను అమలు చేస్తే, ఉద్యోగులు తమ కుటుంబంతో గడిపేందుకు అత్యధిక సమయం లభిస్తుందని, తద్వారా మానసికంగా ఉద్యోగులు ఎంతో తాజాగా ఉండేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు చేసింది. నాలుగు రోజుల పనిదినాలు మినహాయించి మిగిలిన ఖాళీ సమయంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు పెంచుకునే వీలుంటుందని, ప్రజలు హాయిగా తిరుగుతూ షాపింగ్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని జపాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇక, పెళ్లికాని వారైతే ఈ ఖాళీ సమయంలో పెళ్లి ఆలోచనలు చేసి, తగిన భాగస్వామిని వెదికి జీవితంలో స్థిరపడతారని, తద్వారా జనాభా పెరిగేందుకు ఇదొక మార్గం అవుతుందని తలపోస్తోంది. అయితే ఈ సిఫారసులను ప్రైవేటు సంస్థలు ఏమేరకు అంగీకరిస్తాయన్నది సందేహమే.

Related posts

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు.. సీబీఐ పిటిషన్

Ram Narayana

10 Reasons You Need to Add Squalane Into Your Skincare Routine

Drukpadam

మరో నెల రోజుల పాటు ముంబైలోనే కొడాలి నాని!

Ram Narayana

Leave a Comment