Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ట్విట్టర్ వర్సెస్ కేంద్రం మధ్య కొనసాగుతున్న వార్

ట్విట్టర్ వర్సెస్ కేంద్రం మధ్య కొనసాగుతున్న  వార్
పలువురు ప్రముఖుల కథలు నిలిపివేస్తున్న వైనం
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతా నిలిపివేత
శశి థరూర్ ఖాతాను కూడా నిలిపివేసిన ట్విట్టర్
శశి థరూర్ ఖాతా రెండు సార్లు నిలిపివేత
కొత్త ఐటీ చట్టం తీసుకువచ్చిన కేంద్రం
మొండిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్
కేంద్ర ప్రముఖుల ఖాతాలపై కొరఢా ఝుళిపిస్తున్న ట్విట్టర్

 

ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ , భారత ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతుంది. కేంద్రం తెచ్చిన కొత్త ఐ టి చట్టం అమలుకు ట్విట్టర్ తన స్వంత నియమావళిని వర్తింప చేయడం తో పలువురు రాజకీయనాయకుల ఖాతాలపై ప్రభావం చూపుతుంది. గతంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాను కూడా స్తంభింపచేసిన ట్విట్టర్ మరోసారి కేంద్ర ఐ టి కమ్యూనికేషన్ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోపాటు సీనియర్ కాంగ్రెస్ పార్లమెంటేరియన్ శశి థరూర్ ఖాతాను నిలిపివేయడంపై వివాదం నెలకొన్నది …..

ఓవైపు కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టం అమలుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండగా, మరోవైపు ట్విట్టర్ తానేమీ తగ్గనంటూ తన సొంత నియమావళి వర్తింపజేస్తూ రాజకీయ ప్రముఖులకు తన తఢాఖా రుచి చూపిస్తోంది. ఇవాళ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆయనదే కాదు, విపక్ష కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శశి థరూర్ ఖాతాను కూడా ట్విట్టర్ నిలిపి వేసింది. అది కూడా రెండు సార్లు. దీనిపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తొలుత రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ థరూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ మరోమారు థరూర్ ఖాతాను స్తంభింపజేసింది. దీనిపై థరూర్ స్పందిస్తూ, ఇలా ఖాతాలను స్తంభింపజేసే బదులు, ఆ వీడియో కంటెంట్ డిజేబుల్ చేయొచ్చు కదా అని హితవు పలికారు. కేంద్రం పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలు నిలిపివేయడం మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలావుంది అని వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ నా ఖాతాను గంటపాటు నిలిపివేసింది: కేంద్రమంత్రి రవిశంకర్

 

కేంద్రానికి, ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కు మధ్య పోరాటం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడంలేదు. అమెరికా చట్టాలను ఉల్లంఘించారంటూ ట్విట్టర్ తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసింది. అనంతరం గంట తర్వాత పునరుద్ధరించింది. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ సొంత అజెండా అమలు చేస్తోందని మండిపడ్డారు. ట్విట్టర్ తీరు చూస్తుంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పనిచేస్తున్నట్టుగా లేదని విమర్శించారు. అనుకూలంగా వ్యవహరించని వారి ఖాతాలు స్తంభింపజేస్తోందని ఆరోపించారు. కొత్త ఐటీ చట్టాలకు కట్టుబడి నడుచుకోకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

Related posts

వెంటనే కీవ్ నగరాన్ని విడిచిపెట్టేయండి..భారతీయులకు సూచన..

Drukpadam

13 సంస్థలు.. ప్రభుత్వ బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల ఎగవేతలు!

Drukpadam

పేపర్ శ్రీనివాస్ పై పెట్టిన అక్రమ కేసును ఎత్తి వేయాలి -టీయుడబ్య్లూజే

Drukpadam

Leave a Comment