Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కత్తి మహేశ్ పరిస్థితి విషమం… మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలింపు…

కత్తి మహేశ్ పరిస్థితి విషమం… మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలింపు

ఈ ఉదయం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
తీవ్రంగా గాయపడిన కత్తి మహేశ్
నెల్లూరు మెడికవర్ ఆసుపత్రికి తరలింపు
తలకు, కంటికి బలమైన గాయాలు తగిలాయన్న వైద్యులు
నెల్లూరు మెడికవర్ ఐసీయూలో చికిత్స
తొలుత ప్రమాదం ఏమి ఉండకపోవచ్చిన భావించిన డాక్టర్లు
మహేశ్ ఎడమ కంటికి తీవ్ర గాయం,తలకు బలమైన గాయాలు
ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు

ప్రముఖ సినీ సమీక్షకుడు, నటుడు కత్తి మహేశ్ పరిస్థితి విషమంగా ఉందని నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కత్తి మహేశ్ ఈ ఉదయం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయనను నెల్లూరు మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన తాజా పరిస్థితిపై వైద్యులు వివరాలు తెలిపారు. కత్తి మహేశ్ తలకు, కంటికి బలమైన గాయాలు తగిలాయని వివరించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకి తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉదయం జాతీయ హైవేపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ముందు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

సినీనటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ… కత్తి మహేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగిన వెంటనే ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రరిస్థితి సీరియస్ గా ఉండటంతో చైన్నై ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కత్తి మహేశ్ మెడికవర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఎడమ కంటికి తీవ్ర గాయమయినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి ఆయన స్నేహితులు ఆరా తీస్తున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఈ సాయంత్రం వైద్యులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందని మొదట అనుకున్న సీరియస్ గా ఉండటంతో చెన్నై కి తరలించారు .

 

Related posts

సరిహద్దుల్లో పైపుల ద్వారా భారత్ కు హెరాయిన్ పంపుతున్న స్మగర్లు

Drukpadam

అమెజాన్ కు షాక్ … రూ.202 కోట్ల జరిమానా విధించిన సీసీఐ!

Drukpadam

భారత కంపెనీ దగ్గు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి!

Drukpadam

Leave a Comment