Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రి ఈటల మాటల భావమేమి తీరుమలేశా ?

మంత్రి ఈటల మాటల భావమేమి తిరుమలేశా ?
టీ ఆర్ యస్ ఒక వ్యక్తి పై ఆధార పడే పార్టీ కాదు
టీ ఆర్ యస్ లో ప్రతి వ్యక్తి నాపార్టీ,నాజండా అనకపోతే పార్టీ నిలవదు
పార్టీ ఎవరు పెట్టారు ,జెండా ఎవరు తెచ్చారు అనేది కాదు
పార్టీ నిలవాలంటే ,సమిష్టి గా పని చేయాలి
పార్టీలు ,నేతలు చరిత్ర నిర్మాతలు కారు ,ప్రజలే చరిత్ర నిర్మాతలు
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి ?
కెసిఆర్ కు నాకు మధ్య గ్యాప్ లేదు
పార్టీలో ఉన్నప్పుడు ఆనందము భాద రెండు ఉంటాయి .
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీ ఆర్ యస్ లో అంతా బాగానే ఉందా?అంటే ఆపార్టీ నేతలు ఉందని అంటారు. కెసిఆర్ మాటకు తీరుగులేదు . కానీ అనేక మంది నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉందనేందుకు తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ వెంట నడిచిన సీనియర్ నేత మంత్రి ఈటల రాజేందర్ మాటలే నిదర్శనంగా ఉన్నాయి . గతంలో ఒకసారి ఈటల ఇదేతరహాలో మాట్లాడారు . అప్పుడు మంత్రి వర్గ మార్పుల పై చర్చ జరుగుతున్నా సందర్భం , ఆయన పదవి పోతుందనే ప్రచారం జరిగింది. మీడియాలో పుంఖాను పుంఖానుగా వార్తలు , ఒక సందర్భంలో ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. టీఆర్ యస్ పార్టీ ఎవడబ్బ సొత్తు కాదని ఎవరో ఒకరే దాని ఓనర్ కాదని , తామందరం దానికి ఓనర్లమేనని సంచలనం లేపారు . అంతకు మందు దివంగత నేత మాజీ హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఇదే తరహాలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో ఈటల మాటలు మరో మరు కలకలం రేపాయి . ఆయన ఒక టీ వీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో పలు ఆశక్తికర విషయాలు చెప్పారు . ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయితే తప్పేంటి అంటూనే పార్టీ ఎవరి సొంతం కాదని మరో సారి కుండబద్దలు కొట్టారు . పార్టీ ఎవరు పెట్టారు ?జెండా ఎవరు తెచ్చారు అనేది కాదని అందరు కలిస్తేనే పార్టీ అని ఇది ఎవరో ఒకరి సొంతం కాదని ప్రత్యేకించి కెసిఆర్ గాని కేటీఆర్ సొంతం కాదని అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు . పార్టీలు గాని నేతలుగాని , చరిత్ర నిర్మాతలు కారని, ప్రజలే చరిత్ర నిర్మాతలని అయన కుండబద్దలు కొట్టారు . కెసిఆర్ కు తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది ,భాదలు ఉంటాయన్నారు . తాను బాదపడ్డ విషయాన్నీ ఆయన చెప్పకనే చెప్పారు . ఇప్పటికే కేటీఆర్ 99 శాతం పనులు చేస్తునందున ఆయన ముఖ్యమంత్రి అయితే ఎలాంటి తప్పులేదన్నారు . కోవిద్ వ్యాక్సిన్ ప్రారంభ కారక్రమానికి కెసిఆర్ రాకపోవటం పై తప్పు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తనకు పార్టీ లో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు . సైలెంట్ గా ఉండటటానికి కారణాలు ఏమి లేవని పాత్రలు మాత్రమే అప్పుడప్పుడు మారతాయన్నారు . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా ,ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకరకంగా వ్యహరించాల్సి ఉంటుందన్నారు . ఈటల మాటలు తూటాల్లా ఉండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది .ప్రస్తుతం టీఆర్ యస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నిరూపించాయి.ఈ రెండు ఎన్నికలలో బీజేపీ అడ్వాన్స్ కావటంతో ఆపార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది . ఈ సందర్బంగా ఈటల లాంటి సీనియర్ నేత ఉద్యమకారుడు పార్టీపైనా వ్యాఖ్యలు చేయటం కొంత ఇబ్బంది పెట్టె అంశంగానే పరిశీలకులు అభిప్రాయం పడుతున్నారు. ఒకపక్క టీ ఆర్ యస్ ప్రభుత్వం పై బీజేపీ విమర్శల జడివాన కురిపిస్తుంది . మరోపక్క కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనతో ఉన్న కెసిఆర్ కు పార్టీలోనూ బయట జరుగుతున్నా చర్చలు పునరాలోచనలో పాడేస్తాయా అనే సందేహాలు కలుగు తున్నాయి . చూద్దాం ఈటల మాటల పై పార్టీ ఏవిదంగా స్పందిస్తుందో ???

Related posts

హర్యానా రైతులపై విరిగిన లాఠీ…

Drukpadam

భట్టి పగటి కలలు కంటున్నారు …. శాసనసభలో కేటీఆర్!

Drukpadam

వైసీపీలో జిల్లాల ర‌చ్చ‌.. కోన‌సీమ జిల్లాలో ఎంపీటీసీ స‌హా 38 మంది రాజీనామా!

Drukpadam

Leave a Comment