Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో రెండు గదుల ఇంటికి షాక్ తగిలేలా పన్ను 6 .50 లక్షలు…

ఖమ్మం లో రెండు గదుల ఇంటికి షాక్ తగిలేలా పన్ను 6 .50 లక్షలు
-లబోదిబో మన్న ఇంటి యజమాని: విషయం కమిషనర్ దృష్టికి
– వెంటనే సమస్య పరిష్కరించిన కమిషనర్
-కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఇంటి యజమాని ..

 

ఖమ్మం : 55వ డివిజన్ వేణుగోపాల్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్దుల్ రెహ్మాన్ 6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఇంటి పన్ను అక్షరాల 6.50 లక్షల రూపాయలు వచ్చింది … రోడ్డు పై పూల వ్యాపారం చేసే నిరుపేద వ్యాపారి రెండు గదుల ఇంటికి 6.50 లక్షల ఇంటి పన్ను మునిసిపాలిటి అధికారులు విధిస్తు ఆయనకు నోటీసు పంపారు . దీంతో ఇంటి యజమాని అబ్దుల్ రెహ్మాన్..లబోదిబో మన్నాడు … విషయంపై అక్కడ ఇక్కడ చెప్పగా సామాజిక కార్యకర్త యువ న్యాయవాది సాదిక్ షేక్ దగ్గర చెప్పామన్నారు . దీంతో అతను సాదిక్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు . ఆయన ట్విట్టర్ ద్వారా మున్సిపల్ కొర్పొరేషన్ కమిషనర్ అనురాగ్ జయంతి ద్రుష్టికి తెచ్చారు. ఇది చుసిన కమిషనర్ సైతం అవాక్కు అయి విషయం ఆరా తీశారు. అది పొరపాటుగా వచ్చిందని గ్రహించి తిరిగి బిళ్ళ తయారు చేసి పంపించారు.

సమస్యను పరిష్కరించిన మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి . ట్విట్టర్ మరియు ఫోన్ ద్వారా కమిషనర్ కు సమస్య గురించి వివరించిన సామాజిక కార్యకర్త యువ న్యాయవాది సాదిక్ షేక్ . రెండు గదుల ఇంటికి 6 సంవత్సరాలకు 6.50 లక్షలు టాక్స్ విధింపు , రోడ్డు పై పూల వ్యాపారం చేసుకుని బ్రతికే చిన్న కుటుంబం లక్షల్లో వస్తున్న ఇంటి పన్ను చూసి షాక్ కు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు . పన్ను కట్టడం పెను భారంగా మారింది , ఇల్లు అమ్మినా టాక్స్ కట్టలేని దయనీయ పరిస్థితి అని వివరించిన బాధితుడు . మీడియా, అధికారులు ఆఫీసుల చుట్టు తిరిగి వేసారి యువ న్యాయవాది సాదిక్ షేక్ సహాయం కోసం ఆర్జించగా సమస్య కు వెంటనే పరిష్కారం చూపారు . వాస్తవంగా రూల్స్ ప్రకారం 85 గజాల , రెండు రూముల ఇంటికి 2016 – 2021 వరకు 8913/- విధించాలి కానీ 6.50 లక్షలు వేశారు .

కమిషనర్ వెంటనే ఆర్ ఓ శ్రీనివాస్ తో మాట్లాడి ఆన్లైన్ ప్రాపర్టీ టాక్స్ వెబ్సైట్ లో కూడా 8,913/- గా సూచిస్తూ సమస్య పరిష్కరించారు .సమస్యను పరిష్కరించిన మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతికి సామాజిక కార్యకర్త సాదిక్ షేక్, ఇంటి యజమాని అబ్దుల్ రెహ్మాన్. కృతజ్ఞతలు తెలిపారు .

Related posts

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: షర్మిల

Drukpadam

అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైతే రేపు ఢిల్లీకి జగన్!

Drukpadam

మూడేళ్ల కిందట సువేందు బాడీగార్డు మృతి… కేసును సీఐడీకి అప్పగించిన మమత!

Drukpadam

Leave a Comment