Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్: మంత్రి పువ్వాడ…

దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్: మంత్రి పువ్వాడ
-దళితుల్ని నిలువునా ముంచిన బీజేపీ, కాంగ్రెస్‌
-దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసిఆర్ కృషి

దళితుల అభ్యున్నతే ధ్యేయంగా   వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేచ్తున్నారని ఇందుకు భిన్నంగా దళితులను నిలువునా ముంచిన చరిత్ర , బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమారు ధ్వజమెత్తారు .మంగళవారం ఖమ్మం లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దళితుల కోసం అఖిల పక్షసమావేశాన్ని వేర్పాటు చేసి దళితి ఎంపరర్ మెంట్ కోసం అందరి అభిప్రాయాలు తీసుకోని నిధులు కేటాయంపు , కార్యాచరణ ప్రకటిచడం పట్ల దళితులంతా కేసీఆర్ కు అభినందనలు తెలుపుతున్నారని , పాలాభిషేకం చేస్తున్నారని అన్నారు.

దళితుల్ని నిలువునా ముంచిన బీజేపీ, వారి సమస్యలు విని సలహాలు ఇచ్చేందుకు కూడా సిద్దపడక దళితుల పట్ల చిన్న చూపు చూస్తూ సీఎం సమావేశాన్ని బహిష్కరించడం విచారకరమన్నారు . కాంగ్రెస్ ,బీజేపీలకు దళితుల సమస్యల పట్ల చిత్తశుద్ధ్ది లేదని విమర్శించారు . దళితులను బీజేపీ ఎన్నడూ పట్టించుకోలేదని, ఆ పార్టీది దళిత వ్యతిరేక భావజాలమేనని మంత్రి పువ్వాడ ​ ధ్వజమెత్తారు. దళితులు ఎదిగితే తమ ఆటలు సాగవన్న ఆలోచనతో వారిని ఎదగనీయకుండా బీజేపీ కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగానే వర్సిటీల్లో పరిశోధనలు చేసే దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌లు ఇవ్వటంలేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై తరచుగా దాడులు జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. దళితుల్ని ఓటుబ్యాంకుగా వాడుకొంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. వారి అభ్యున్నతి కోసం ఎన్నడూ ఆలోచించలేదని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ దుయ్యబట్టారు.

దళితుల అభ్యున్నతిలో దేశానికి తెలంగాణ మార్గదర్శిగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఏడేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణలో దళితుల అభివృద్ధి, సంక్షేమానికి రూ.55 వేల కోట్లు ఖర్చుచేయటం అసాధారణమన్నారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… దళిత సాధికారిత స్కీంను ప్రారంభించటంపై రాష్ట్రంలోని దళిత జాతి పాలాభిషేకాలతో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అట్టడుగున ఉన్న వంద దళిత కుటుంబాలను ఎంపికచేసి నేరుగా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయటం ద్వారా 11,900 కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని చెప్పారు.

దళిత సాధికారతపై సీఎం నిర్వహించిన అఖిలపక్ష భేటీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని కొనియాడారు. భూమిలేని నిరుపేద దళితులకు రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలుచేయాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం గొప్పదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రెండురోజులు దళితవాడల్లో నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి పువ్వాడ తెలిపారు.

సామాజిక సమస్యల నుంచి దళితులకు విముక్తి కల్పించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడేండ్లలో దళితులకు ప్రభుత్వం 16 వేల ఎకరాలను ఉచితంగా పంపిణీ చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ స్థానంలో ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ఫండ్‌ను తెచ్చి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ చెప్పారు. మంత్రి పువ్వాడ తో పాటు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్,పలువురు దళిత నేతలు పాల్గొన్నారు

Related posts

వరంగల్ లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా, బండి!

Drukpadam

కేటీఆర్ నాస్తికుడు ముందు ఆయ‌న‌ను మార్చండి : బండి సంజ‌య్!

Drukpadam

ఢిల్లీకి మారిన అమరావతి రైతుల యాత్ర…జంతర్ మంతర్ వద్ద ధర్నా !

Drukpadam

Leave a Comment