Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హెచ్ ఆర్ సి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని అధికార్లను ప్రాసిక్యూట్ చేయాలి…

హెచ్ ఆర్ సి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని అధికార్లను ప్రాసిక్యూట్ చేయాలి
-భూ సమస్యలపై ఇచ్చినా ఆదేశాలు అమలు జరిగేలా చూడాలి
-పేదల గుడిశల తొలగింపు అన్యాయం గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి
-మణిదీప్ అనే సమాచార హక్కు కార్యకర్తని అక్రమ అరెస్ట్ పై విచారణ జరపాలి
హెచ్ ఆర్సీ చైర్మన్ కు తెలంగాణ జనవేదిక ఫిర్యాదు

ఖమ్మం : భూ సమస్యల ఫిర్యాదులపై హెచ్ ఆర్ సి ఇచ్చిన ఆదేశాలు అధికారులు అమలు చేయడం లేదంటూ తెలంగాణ జన వేదిక అధ్యక్షులు కోయిన్ని వెంకన్న బుధవారం ఖమ్మం కు వచ్చిన హెచ్ ఆర్ సి చైర్మన్ కు పిర్యాదు చేశారు.ప్రధానంగా భూ సంబంధిత సమస్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సుమారు 53 ఆర్డర్లను హెచ్ ఆర్ సి ఇచ్చినప్పటికీ జిల్లా అధికారులు వాటిని పరిష్కరించ లేదని హెచ్ ఆర్ సి చైర్మన్ కు ఇచ్చిన వినతిపత్రంలో ఆరోపించారు .

స్థానిక మమత హాస్పిటల్ సమీపంలో హార్వెస్ట్ పాఠశాల సమీపంలోగల ఎన్నో సంవత్సరాలుగా పేదలు గుడిసెలను వేసుకొని నివసిస్తుండగా వాటిని నిర్ధాక్షిణ్యంగా పోలీసులను ఉపయోగించి బలవంతగా తొలగించి వారికీ ప్రత్యాన్మాయం చూపలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. , పట్టాలు ఇవ్వకుండా బాధితులను స్థానిక ఎం ఆర్ మీరు ఓటు ఎవరికి వేశారని. దాని ఫలితమే ఇది అని వ్యాఖ్యానించడం గమనార్హం పేర్కొన్నారు . హెచ్ఆర్సీ ఆర్డర్లను జిల్లా అధికారులు నిర్లక్ష్యం తో అమలు చేయకపోవటం పై ప్రాసిక్యూట్ చేయాలని కోరారు.

సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి వివరాలు తెలుసుకుంటున్న మణిదీప్ అనే సమాచార హక్కు కార్యకర్త పై రెవెన్యూ అధికారులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు . భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలంలో గల ఏడేళ్ల బయ్యారం కు చెందిన ఈ కార్యకర్త ను జైలుపాలు చేయడం తగదన్నారు . ఇటువంటి హక్కుల ఉల్లంఘనపై హెచ్ఆర్సీ చైర్మన్ గా మీరు దృష్టిసారించి , న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు .

హెచ్ ఆర్ సి చైర్మన్ ను కలిసిన వారిలో తెలంగాణ జన వేదిక ఉపాధ్యక్షులు బానోతు భద్రు నాయక్ , సహాయ కార్యదర్శి సోమరాజు , మందా బుచ్చిబాబు , రైతులు , పలువురు గుడిసె వాసులు ఉన్నారు.

Related posts

భార్య పెళ్లికి పెద్దగా భర్త.. ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం…

Drukpadam

7 Kylie Jenner Hairstyles You’ve Probably Forgotten About

Drukpadam

ఎం పీ సోయం బాబురావు రాజీనామా చేయాలి:ఆదివాసీల డిమాండ్

Drukpadam

Leave a Comment