Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జలదోపిడిపై కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సంచలన వ్యాఖ్యలు…

జలదోపిడిపై కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సంచలన వ్యాఖ్యలు…
-దోపిడీకి అసలు కారకుడు కేసీఆర్ …వైయస్ కు క్లిన్ చిట్
-జల దోపిడీలో వైయస్ పాత్ర లేదు.. జగన్ హస్తం మాత్రం ఉంది
-కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణం
-రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయి
-ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే వారిని బహిష్కరించాలి
-కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే…. ఇరు రాష్ట్ర ప్రభుత్వ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి…. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ… కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణమని అన్నారు…. నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు…. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని… కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. ఇందుకు కేసీఆర్ సూచనలే కారణమన్నారు .

రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయని రేవంత్ దుయ్యబట్టారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ పథకానికి రూపకల్పన జరిగిందని అన్నారు. కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని… కానీ, ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను షర్మిల పార్టీ వైపు నడిపించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు. నదీ జలాల విషయంలో లేనిపోని వివాదాలను సృష్టించి రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలని ఆపుతారో లేదో తేల్చుకోవాలని అన్నారు. లేక పొతే ప్రజలే బుద్ది చెప్పే రోజులు ఎంతో కాలం లేవని అన్నారు. కేసీఆర్ మాయమాటలు మోసాలను ప్రజలు గ్రహించారని ఒకసారి ,రెండు సార్లు మోసాలతో మాయమాటలతో బతకొచ్చు కానీ ఎల్లకాలం బతకలేరని అన్నారు . కాంగ్రెస్ పార్టీ అన్న విషయాలను ప్రజల ముందు ఉంచి ప్రజాకోర్టులో కేసీఆర్ ను నిలబెడతామని అన్నారు.

Related posts

ఈసారి 100 సీట్లు ఖాయం: సీఎం కేసీఆర్…

Drukpadam

విజయవాడలో బాలిక ఆత్మహత్య… టీడీపీ నేతలపై రోజా ఆగ్రహం!

Drukpadam

కన్నా అనుకున్నట్లే కండువా కప్పుకున్నారు …

Drukpadam

Leave a Comment