Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మరోమారు రికార్డులకెక్కిన రష్యా.. ప్రజలకు మూడో డోసు పంపిణీ షురూ!

మరోమారు రికార్డులకెక్కిన రష్యా.. ప్రజలకు మూడో డోసు పంపిణీ షురూ!
-రష్యాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్
-రాజధాని మాస్కోలో మొదలైన బూస్టర్ డోసు పంపిణీ
-ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోసు ఇచ్చే యోచన

ప్రపంచాన్ని మరోమారు కరోనా వణికిస్తుంది … ఈసారి వచ్చే వైరస్ చాల ప్రమాదకరమని దానికి స్పీడ్ గా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ప్రకటించింది . ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్న అది ఆరులెలాలకు మించి పనిచేయకపోవచ్చునని వస్తున్నా వార్తలతో రష్యా అప్రమత్తమైనది . రష్యా తమదేశంలో ప్రజలకు మూడవ దోసుగా బస్టర్ డోస్ ఇవ్వడం ప్రారంభించింది.ఇది ప్రపంచంలోనే రికార్డ్ గా చెప్పవచ్చు . వచ్చే వైరస్ కు ఇంకా ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అందువల్ల బస్టర్ డోస్ ప్రతి ఆరునెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుందని రష్యా లోని శాస్త్రవేత్తలు నిర్దారించారు.

కరోనా వ్యాక్సిన్‌ను మొట్టమొదట రిజిస్టర్ చేసుకున్న దేశంగా రికార్డులకెక్కిన రష్యా ఇప్పుడు మరోమారు వార్తలకెక్కింది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తుండడంతో బూస్టర్ డోసు పంపిణీకి సిద్ధమైంది. టీకాల లేమి కారణంగా చాలా దేశాలు తమ ప్రజలకు టీకా తొలి డోసు ఇచ్చేందుకే నానా కష్టాలు పడుతున్నాయి. రష్యా మాత్రం మూడో డోసు పంపిణీ చేపట్టినట్టు ప్రకటించి ఈ విషయంలో మొదటి స్థానంలో నిలిచింది.

రెండో డోసు తీసుకుని ఆరు నెలలు అయిన వారికి మూడో డోసు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోసు ఇవ్వాలని కూడా యోచిస్తోంది. ఈ క్రమంలో రాజధాని మాస్కోలో నిన్నటి నుంచే బూస్టర్ డోసు పంపిణీ మొదలైంది. తాజాగా వెలుగు చూస్తున్న కొత్త వేరియంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

తొలి రెండు డోసుల వల్ల శరీరంలో వృద్ధి చెందే యాంటీబాడీలు ఆరు నెలల తర్వాత క్షీణిస్తున్నట్టు నివేదికలు చెబుతుండడం, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు తొలి రోజుల్లో వెలుగు చూసిన వేరియంట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించినవి కావడంతో రష్యా సహా చాలా దేశాలు మూడో డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

Related posts

తన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను ప్రకటించగా ముఖేష్ అంబానీ …

Drukpadam

Drukpadam

మిల్లెట్స్ అందరికీ సరిపడకపోవచ్చు..!

Drukpadam

Leave a Comment