ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చివరి అవకాశం సుప్రీంకోర్టు వైపు చూపు?
–ఎన్నికల కమిషనర్ ,ప్రభుత్వం మధ్య పూడ్చలేని ఆగాధం
–ప్రభుత్వం , ఉద్యోగులు ఎన్నికలు వద్దు అంటున్నా కమిషనర్ ససేమీరా
–ఇప్పటికే ఇద్దరు కలక్టర్ లకు ఒక ఎస్పీ తో సహా 9 మంది అధికారులకు ఉద్వాసన
–ఎన్నికల కమిషనర్ కు సి యస్ , పంచాయత్ రాజ్ కార్యదర్శి లేఖలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చివరి అవకాశంగా సుప్రీంకోర్టు వైపు చూపులు మాత్రమే మిగిలాయి.ఏపీ స్థానిక సంస్థల బంతి సుప్రీంకోర్టులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి , ఎన్నికల కమిషనర్ మధ్య నెలకొన్న అగాధం పూడ్చలేనిదిగా ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ,ఉద్యోగులు సహకరించకున్న తాను అనుకున్నది సాధించాలనే ముందుకు సాగుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ . మార్చ్ నెలలో రిటైర్ అవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి తాను ఉండగానే ఎన్నికలు జరపాలని గట్టి పట్టుదలతో ఉండగా , ఆయన తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్నందున ఆయన ఉండగా ఎన్నికలు జరపరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తోడు కరోనా వాక్సిన్ వచ్చింది. వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. అందువల్ల మహమ్మారిగా మరీనా కరోనా వాక్సినేషన్ కొనసాగుతుండగా ఎన్నికలు పెట్టరటం సరైంది కాదని ప్రభుత్వ వాదన. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో సహా పలువురు అధికారులు ఎన్నికల సంఘ కమిషనర్ నిమ్మగడ్డ కు కలిసి విజ్ఞప్తి చేశారు . ఉద్యోగ సంఘాలు కూడా వాక్సిన్ వేసుకోకుండా ఎన్నికల విధులు నిర్వర్తించలేమంటున్నారు . అయినా నిమ్మగడ్డ పట్టు విడటంలేదు. ఇప్పటికే ఇద్దరు కలెక్టర్ లు , ఒక ఎస్పీ తో సహా 9 మంది అధికారులను తొలగించాలని సి యస్ కు లేఖ రాశారు .
ఎవరి అధికారాలు ఎలా ఉన్న రెండు వ్యవస్థలు ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి ఉండాల్సింది పోయి పోట్లాడుకుంటున్నాయి. దీంతో వ్యవహారాలు గందరగోళానికి అయోమయానికి ,దారితీస్తున్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.గత పదినెలల కాలంగా ఇది కొనసాగుతున్నది. ప్రజాస్వామ్యంలో ఇది మంచిదికాదు.ఎవరికీ వారు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆజ్యం పోస్తే దాన్ని జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్నది.దీనికి చరమగీతం పడాల్సిన న్యాయ వ్యవస్థ ఎందుకో వెనకడుగు వేస్తున్నట్లు అనిపిస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోమ్ మంత్రికి రాసినట్లుగా చెబుతున్న లేఖ వివాదాస్పదంగా మారింది. ఈ లేఖ తెలుగుదేశం తయారుచేసిందని, వారి కార్యాలయం నుంచే వచ్చిందని వైసీపీ ఆరోపణ .అప్పటినుంచి ఆయనను తప్పించేందుకు అధికార వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టిన సంగతి తెలిసిందే . రమేష్ కుమార్ కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తగ్గట్లుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకులతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. . అందుకు పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఉదంతాన్ని ఉదహరిస్తున్నారు . ప్రభుత్వం కూడా రమేష్ కుమార్ ను వెంటాడుతుంది . ఆయన పదవి కాలం ముగియకుండానే తొలగించింది. దానిపై ఆయన కోర్ట్ ను ఆశ్రయించి తిరిగి తనపదవిని పొందగలిగారు. ఇది అంతా జరిగినప్పటికీ ఎవరు రియలైజ్ కాలేక పోతున్నారు .ఇటు ప్రభుత్వం ,అటు ఎన్నికల కమిషనర్ బెట్టుతో మెట్టు దిగకుండా ఉండటంతో వాతావరణం చెడిపోయింది . మొదట రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ఎన్నికలు జరుపుతాం అంటూ పరుగులు పెట్టడంలో అర్థం ఏమిటి ?అంతకుముందు కరోనా లాంటి సమస్య లేకున్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారనే దానికి రమేష్ కుమార్ సమాధానం ఏమిటి ?అనేవి ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. జగన్ సర్కార్ కూడా రమేష్ కుమార్ విషయంలో పంతాలకు,పట్టింపులకు పోతుందనే విమర్శలు ఉన్నాయి.రమేష్ కుమార్ తో మాట్లాడి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను చెప్పి తమదారికి తెచ్చుకుంటే బాగుండేదని అభిప్రాయాలూ ఉన్నాయి . ఇది సాధ్యమా అంటే ఇంత దూరం వచ్చాక అంతా తేలిగ్గా ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి.మార్చ్ చివరికి రిటైర్ కానున్న రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై కక్షగట్టి వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో భాగస్వాములు కావాల్సిన అధికారులు , ఉద్యోగ సంఘాలు వాక్సిన్ వేసుకున్న తరువాత ఎన్నికలు నిర్వవించటం మంచిదని మొత్తుకున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన దారి తనదే అంటున్నారు . కోర్ట్ కూడా ఎందుకో ఎన్నికలు నిర్వించమని చెప్పటం పై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి .రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను , ఉద్యోగ సంఘాల వినతిని పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్ళటం అదికూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , పంచాయతీరాజ్ కార్యదర్శి ప్రసుత పరిస్థితుల్లో ఎన్నికలు సాధ్యం కాదని చెప్పినప్పటికీ కమిషనర్ వినకపోవటంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. జగన్ సర్కార్ కు ఎక్కడో ఎదో తేడా కొడుతోంది . దాన్ని అధిగమించకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కరోనా వాక్సిన్ వేస్తున్న తరుణంలో సాధ్యం కాదని హైకోర్ట్ ను ఆశ్రయించింది . హైకోర్టు రెండు ప్రధానమైనమైనవేనని స్పష్టం చేస్తూ ఎన్నికలు నిర్వయించాల్సిందేనని తేల్చిచెప్పింది . దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది . సుప్రీం ఏరకమైన తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. ఈలోపు నిమ్మగడ్డ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం అవుతున్నారు చూద్దాం ఏమి జరుగుతోందో ???