ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యం: పోలీస్ కమిషనర్!
రూట్ మెబైల్, స్టైకింగ్ ఫోర్స్ తో పాటు 1015 మందితో పకడ్బందీగా పోలీసు బందోబస్తు
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులకు విధివిధానాలు
ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. స్ధానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల నిర్వహణ విధులు, విధివిధానాలు, బాధ్యతలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల విధులు అవగాహన సదస్సులో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని అదే తీరును ఈ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రదర్శించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం చేయాలని సూచించారు.
ఏ చిన్న సంఘటన జరిగిన వేంటనే అయా ప్రాంతాలకు చేరుకునే విధంగా రూట్ మెబైల్ పార్టీలు, స్టైకింగ్ ఫోర్స్ మరింత వేగవంతంగా స్పందించే విధంగా పకడ్బందిగా ప్రణాళికతో సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, నియమావళిలోని ఆంశలను పరిగణంలోకి తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకొని మరియు ఆర్టీపిసిఆర్ టెస్టు చేసుకున్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఓటర్లు ఆందోళన చేందకుండా ప్రశాంతవంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కువినియోగించుకునేందుకు వీలుగా స్వేచ్చయుత వాతావరణం కల్పించాలన్నారు. అదేవిధంగా ఓటర్లతో సమన్వయం పాటిస్తూ సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలన్నారు.
పొలింగ్ సరళిలో భాగంగా మీకు అప్పగించిన భాద్యతలను మాత్రమే సమయస్పూర్తితో సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనవసరమైన విషయాలలో తలదుర్చవద్దని ఆదేశించారు.
డీసీపీలు (2) అడిషనల్ డీసీలు (03) ఏసీపీలు (10) సీఐలు (22) ఎస్సై (46) మొత్తం 1015 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
సమావేశం డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డిసీపీ సుభాష్ చంద్ర బోస్ , ఏసీపీలు అంజనేయులు, రామోజీ రమేష్ , ప్రసన్న కుమార్ , వెంకటస్వామి, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.