Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 October 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

మంత్రులు వివేక్ , అడ్లూరి మధ్య విభేదాలు

మంత్రులు వివేక్ , అడ్లూరి మధ్య విభేదాలు

నిన్నగాక మొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ,అడ్లూరి లక్ష్మణ్ ,వివేక్ మధ్య పొడచూపిన పంచాయతీ సర్దుమణిగిందనుకుంటే మళ్ళీ వివేక్ , అడ్లూరి మధ్య విభేదాలు పొడచూపాయి..తనపై అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని , మాల జాతి వాడినని చులకనగా మాట్లాడటం తగదని మండిపడ్డారు … జూబ్లీహిల్స్ ఇంచార్జ్ గా నాకు మంచి పేరు వస్తుందని అడ్లూరి లక్ష్మణ్‌కి కుళ్ళు ఉందని అన్నారు .. కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు.. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగా మరి మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదు.. నన్నే ఎందుకు విమర్శిస్తున్నారు వివేక్ ప్రశ్నించారు .అడ్లూరి లక్ష్మణ్‌కు మొదట కాంగ్రెస్ టికెట్ ఇప్పించిందే కాకా వెంకటస్వామి.. ఈ విషయం మర్చిపోతున్నాడని అన్నారు .

మంత్రి వివేక్ మాటలకూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు .వివేక్ తన పేరు తీసి మాట్లాడడం అత్యంత బాధాకరమన్నారు …నేను ఎప్పుడు ఒకటే పార్టీ ..ఒకటే జెండాకు కట్టుబడి ఉన్న పార్టీ లైన్ దాటి ప్రవర్తించలేదని వివేక్ కు చురకలు అంటించారు .. అదే సందర్భంలో తమ మధ్య ఏదైనా ఉంటె కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని ఇలా రచ్చచేయడం తగదని అన్నారు . వివేక్ మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకు, మర్యాదకు, గౌరవానికి వదిలేస్తున్నానని లక్ష్మణ్ పేర్కొన్నారు …ఈ వివాదం సర్దుమణుగుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది ..