Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 27 December 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

గచ్చిబౌలిలో రూ. 36 లక్షలకే ఫ్లాట్.. ప్రభుత్వం బంపరాఫర్.

ప్రతి కుటుంబానికి సొంతిళ్లు అనేది ఓ కలగా ఉంటుంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. రూపాయి రూపాయి పోగేసి సొంతింటి నిర్మాణం కోసం ఖర్చు చేస్తుంటారు. అయితే చాలా మందికి అనేక కారణాల వల్ల సొంతింటి కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో సొంతిళ్లు కొనుగోలు చేయాలంటే రూ. కోట్లు కావాల్సి ఉంటుంది. అయితే భాగ్య నగరంలోని మధ్య తరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ తీసుకొచ్చింది.

సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ హౌ సింగ్‌ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరా బాద్‌ లోని గచ్చిబౌలితోపాటు ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న అపార్ట్‌ మెంట్లలోని సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్ల ను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు అలాగే వరంగల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్‌ హిల్స్‌ దగ్గరలో మరో 126 ఫ్లాట్లు కలిపి మొత్తం 339 ఫ్లాట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది.

హైదరా బాద్‌ లోని గచ్చిబౌలితోపాటు ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న అపార్ట్‌ మెంట్లలోని సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్ల ను విక్రయించేందుకు సిద్ధమైంది. ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు అమ్మకానికి పెట్టింది. గచ్చిబౌలిలో ఫ్లాట్ల ధరలు రూ.26 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు నిర్ణయించింది తెలంగాణ హౌజింగ్ బోర్డు. ఈ ఫ్లాట్ల కోసం ఆన్‌ లైన్ విధానం ద్వారా లేదా మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు (నెలకి రూ. 50,000) లోపు ఉన్న దరఖాస్తుదారులు అర్హులు.

అలాగే దరఖాస్తు చేసుకునే సమయంలో టోకెన్ అడ్వాన్స్ కింద రూ. లక్ష‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా రిఫండబుల్. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 3 గా నిర్ణయించారు. గచ్చిబౌలిలోని ఫ్లాట్లకు జనవరి 6న డ్రా చేస్తారు. వరంగల్ ఫ్లాట్లకు జనవరి 8 న డ్రా తీస్తారు. అలాగే జనవరి 10న ఖమ్మంలోని ఫ్లాట్లకు డ్రా తీయనున్నారు.