Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 07 January 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఖమ్మంలో బీఆర్ యస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నకాంగ్రెస్

మునిసిపల్ ఎన్నికలకు ముహూర్తం దగ్గరలోనే ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఖమ్మం నగర కార్పొరేషన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి..పంచాయతీల్లో అధికస్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల కోసం కసరత్తు చేస్తుంది ..తెలంగాణాలో కాంగ్రెస్ కు బలమైన కోటగా ఉన్న ఖమ్మం నగర కార్పొరేషన్లో మొదటిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు …అందులో భాగంగానే బీఆర్ యస్ లో ఉన్న కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు ..ఇప్పటికే దఫదఫాలుగా 23 మంది బీఆర్ యస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా మరో 3 గ్గురు బుధవారం మంత్రి తుమ్మల ఆధ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండలు కప్పుకున్నారు …కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజునే ముగ్గరు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమైంది …ఇంకెంతమంది తమ పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరతారని బీఆర్ యస్ నేతలే ఆరా తీయడం విస్మయానికి గురిచేస్తుంది ..అసలే అధికారం లేక ఉన్న బీఆర్ యస్ కు మేయర్ తో సహా అనేక మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ చేరడం మింగుడు పడటంలేదు …మరో ఐదుగురు కార్పొరేటర్లు పార్టీని వీడనున్నారనే వార్తల నేపథ్యంలో అనుమానితులను బుజ్జగించే పనిలో బీఆర్ యస్ నాయకత్వం ఉంది ..

ఖమ్మంలో బీఆర్ఎస్‌కు మరో షాక్.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు

Revanth Reddy Welcomes BRS Corporators into Congress in Khammam
  • ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు
  • తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఈరోజు మరో ముగ్గురు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కార్పొరేటర్లు ధనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు సీహెచ్ లక్ష్మీ, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణి కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.