Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 14 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

అమెరికాలో భూప్రకంపనలు ..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు…

  • అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైన తీవ్రత
  • సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో భూకంప కేంద్రం
  • రెనో, కార్సన్ సిటీలలో భూప్రకంపనల ప్రభావం

అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నిన్న సాయంత్రం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్)  వెల్లడించింది. సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు.

నెవాడాలోని సిల్వర్ స్ప్రింగ్స్‌కు ఆగ్నేయంగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమికి సుమారు 9 నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు రావడంతో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది.

భూకంపం కారణంగా రెనో, కార్సన్ సిటీ వంటి నగరాల్లోని భవనాలు స్వల్పంగా కంపించాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తాజా వివరాలను సేకరిస్తున్నారు.