Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 02 March 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

జర్నలిస్ట్ కు రూ.10వేల ఆర్ధికసహాయం అందజేసిన కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఫోటో జర్నలిస్ట్ కు రూ.10వేల ఆర్ధికసహాయం అందజేసిన కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్…

నమస్తేతెలంగాణ దినపత్రిక ఫోటోజర్నలిస్ట్ రఘు ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. రెండు చేతులకు గాయాలు కావడంతో, సిమెంట్ పట్టిలు వేసారు…, ప్రస్తుతం ఆయన ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు.

మహబూబాబాద్ లోని రఘు ఇంటికి వెళ్ళి తనవంతు ఆర్థికసహాయంగా కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్ రూ.10వేల చెక్ ను అందజేసారు.

జర్నలిస్ట్ లకు ఇలాంటి సందర్భాల్లో దైర్యం ఉండేలా ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని సూచించారు. తమ సంస్థ తరుపున జర్నలిస్ట్ లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే దిశగా తాము ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఆపద సమయంలో జర్నలిస్ట్ లకు ఆర్థిక చేయూతనందిస్తూ, మానసికంగా దైర్యం చెబుతున్న కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్ కు టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఈ.. సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ…కార్యక్రమంలో టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మగాని మధు, సీనియర్ జర్నలిస్ట్ లు గాడిపల్లి యాదగిరి, గాడిపల్లి శేఖర్, పల్లె శ్రీనివాస్, కరుణాకర్, వెంకట్ తదితరులు ఉన్నారు.