Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీతో జల వివాదం.. ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్!

ఏపీతో జల వివాదం.. ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్!
ఇరు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం
ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన జగన్
ఢిల్లీలో గళాన్ని వినిపించేందుకు వెళ్తున్న కేసీఆర్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. కృష్ణా నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకుంటోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే విషయంపై ఫిర్యాదు చేస్తూ ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తన గళాన్ని వినిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన ఢిల్లీకి వెళ్తారని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ఈ సమస్యపై రెండు రాష్ట్రాలమధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.తెలంగాణ మంత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన ఆయన తండ్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దొంగ గజదొందలు అంటూ చేసిన విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండి పడుతున్నారు . తాము కూడా తిట్టగలం కానీ సంస్కారం అడ్డు వస్తుందని పేర్కొన్నారు. నీటి వివాదం విషయంలో సామరస్యంగా పరిష్కరించుకొంవాల్సిన దాన్ని వివాదంగా చేయడం తగదని అంటున్నారు.తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు.అన్నదమ్ముల వ్యవహరించాలో కానీ రెచ్చెగొట్టే విధంగా మాట్లాడం అభ్యంతర కరమని అంటున్నారు.

నీటిపంపకాల విషయంలో కేంద్రం స్పష్టత నివ్వక పోవడం కూడా రెండు రాష్ట్రాల మధ్య తగాదాలకు హేతువు అవుతుంది. అందువల్ల క్రిష్ణా రివర్ బోర్డు అథారిటీ ,కేంద్రం ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి.

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు లేకపోయినా, అనుమతులు లేకపోయినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నిర్మిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అవసరమైతే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పారు. రేపు కేసీఆర్ జిల్లా పర్యటన ఉంది. అనంతరం ఆయన ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. రెండు, మూడు రోజులు ఆయన అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు.

Related posts

హ‌క్కుల కోసం స‌ర్పంచ్‌లు పోరాడాలి: చంద్ర‌బాబు…

Drukpadam

ఇంతమంది చనిపోయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు: చంద్రబాబు

Drukpadam

కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ముగ్గురు నామినేషన్లు …!

Drukpadam

Leave a Comment