Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీలు మారవచ్చు ,మోసాలు చేయవచ్చు …కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్…

పార్టీలు మారవచ్చు ,మోసాలు చేయవచ్చు …కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్
మా పార్టీ నుంచి పోయినవారు తిరిగి రావచ్చు ,మిగతా వాళ్లకు ఆహ్వానమే
శివకుమార్ పాత సిద్ధాంతాన్ని కొత్తగా తెచ్చారు
రాజకీయాల్లో మోసం చేయడం, పార్టీలు మారడం సాధారణ విషయమే
ప్రభుత్వాన్ని కూల్చేసిన 17 మంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి రావ‌చ్చు
బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్‌ను చేర్చుకున్నాం
పార్టీలో చేరాల‌నుకుంటే కాంగ్రెస్ కమిటీకి దరఖాస్తులు పంపించాలి

కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది . ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రి మీద ఆ పార్టీకి చిందిన ఎమ్మెల్యేలు కొందరు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం ,బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యేతో భేటీ అయిన విషయం విదితమే … అంతకు ముందు బీజేపీకి చెందిన కొందరు ముఖ్యమంత్రి యడియిరప్పను మార్చుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డి కే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారంటూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రచారం మొదలు పెట్టారు.దీనిపై స్పందించిన శివకుమార్ ,తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకోని రావడమే లక్ష్యం అని ఎవరు బహిరంగ ప్రకటనలు చేయవద్దని అన్నారు. శాశనసభ వ్యవహారాలన్నీ తమ పార్టీ నేత సిద్దరామయ్య చూసుకుంటారని , పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే తాను నడుచుకుంటానని ప్రకటించారు. కొద్దీ కాలం క్రితమే అధికార బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ కాంగ్రెస్ పార్టీ చేరారు .

కాంగ్రెస్ నేత‌లు బీజేపీలో చేర‌డంతో క‌ర్ణాట‌క‌లో గ‌తంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, త‌మ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేత‌లు మ‌ళ్లీ త‌మ పార్టీలో చేరాల‌ని కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ పిలుపు నివ్వడం రాజకీయాల్లో పార్టీ లు మారడం ,మోసాలు సర్వసాధారణమే అనే వ్యాఖ్యల వెనక మర్మంపై రాజకీయవర్గాలలో చర్చజరుగుతోంది.

రాజకీయాల్లో మోసం చేయడంతో పాటు పార్టీలు మారడం కూడా సాధారణ విషయమేనని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం ఆశక్తి నెలకొన్నది . సంకీర్ణ కూటమిని కూల్చేసిన 17 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకా ఇత‌రులు ఎవరైనా కాంగ్రెస్ లో చేరాల‌ని అనుకుంటే రావచ్చని తెలిపారు.

ఇప్ప‌టికే తాము బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్‌ను చేర్చుకున్నామని శివ కుమార్ అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను అంగీకరించేవారెవరైనా స‌రే తమ పార్టీలో చేరవచ్చని తెలిపారు. త‌మ పార్టీలో చేరాల‌నుకుంటే కాంగ్రెస్ కమిటీకి దరఖాస్తులు పంపించాలని చెప్పారు. కాంగ్రెస్ నేత‌ల్లో వేర్వేలు అభిప్రాయాలు ఉండ‌వ‌చ్చ‌ని, అయితే, వ్యక్తిగత అభిప్రాయాల కన్నా పార్టీ నిర్ణయమే అందరికీ ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పారు.

Related posts

ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఒక్కటే.. రాహుల్ ఆరోపణలు!

Drukpadam

“ఇంటికి పోయి వంట చేసుకో”… ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్

Drukpadam

రేవంత్ అమెరికా పర్యటనలో కొత్త లుక్ లో తళుక్కుమన్నాడు!

Drukpadam

Leave a Comment