Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లు పై సీఎం కేసీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు…

కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లు పై సీఎం కేసీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు
-రూ.10 వేల కోట్లు వచ్చినా రైతుల కోసం భరిస్తామన్న కేసీఆర్
-సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన
-కాళేశ్వరంపై అనునామాలు వ్యక్తం చేశారని వెల్లడి
-ఇప్పుడు కాళేశ్వరం అద్భుతంగా కనిపిస్తోందని వివరణ
-ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం

సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ అదే కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తోందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల బిల్లు వచ్చినా భరిస్తామని స్పష్టం చేశారు.

ఇతర అంశాల గురించి మాట్లాడుతూ, 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్ సీఐకి అందించామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతు బీమా మాదిరిగా చేనేత కార్మికులకు రూ.5 లక్షల చొప్పున బీమా అందిస్తున్నట్టు వివరించారు. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువస్తామని చెప్పారు. రూ.10 వేల కోట్లతో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Related posts

అమిత్ షా, బీరేన్‌సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీని వీడిన మిజోరం బీజేపీ వైస్ ప్రెసిడెంట్…

Drukpadam

తప్పుడు హామీలిచ్చేవారిని, షార్ట్ కట్ రాజకీయాలు చేసేవారిని నమ్మొద్దు: మోదీ!

Drukpadam

ఫడ్నవిస్ తో విభేదాలపై స్పందించిన షిండే …మాది ఫెవికాల్ బంధమని వ్యాఖ్య …

Drukpadam

Leave a Comment