Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేపు భూమి స్పీడు తగ్గుతుందట!

రేపు భూమి స్పీడు తగ్గుతుందట!
జులై 2 నుంచి 7వ తేదీ మధ్య సూర్యుడికి దూరంగా భూమి
జులై 5న అత్యంత దూరానికి భూమి
దాంతో బాగా పడిపోనున్న భూభ్రమణ వేగం
కెప్లెర్ గ్రహ గమన సూత్రాలకు నిదర్శనం

భూమి తన చుట్టు తాను తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. తద్వారా రేయి, పగలు ఏర్పడుతుంటాయని తెలిసిందే. భూమి తన చుట్టు తాను తిరగడానికి 24 గంటల సమయం పడితే, సూర్యుడ్ని చుట్టి రావడానికి 365 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో భూమి 930 మిలియన్ కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంటుంది.

అయితే, ఈ వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఏడాది జులై 2వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యన భూభ్రమణ వేగం మందగిస్తుందట. దీన్ని ఎపిలియన్ అంటారు. ముఖ్యంగా, జులై 5న ఈ వేగం అత్యంత కనిష్ఠానికి చేరుకుంటుందని పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే సూర్యుడి శక్తి ఆధారంగానే భూభ్రమణం చెందుతుంది. జులై 2 నుంచి 7వ తేదీ మధ్యలో భూమి సూర్యుడి నుంచి అత్యంత దూరంగా వెళ్లిపోతుంది. దాంతో తక్కువ శక్తి పొందిన కారణంగా భూమి వేగం బాగా తగ్గిపోతుంది.

ప్రఖ్యాత జర్మన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు జోహాన్నెస్ కెప్లర్ గ్రహ గమన సూత్రాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గ్రహాలు సూర్యుడికి దూరంగా ఉన్నప్పటి కంటే, దగ్గరగా వచ్చినప్పుడు వేగంగా పరిభ్రమిస్తాయని కెప్లర్ వెల్లడించాడు.

Related posts

21 Quinoa Salad Recipes to Try This Spring

Drukpadam

ఐఐటీ బాంబేలో మాంసాహారం తినే విద్యార్థుల పట్ల వివక్ష!

Ram Narayana

ఫోన్ కోసం అధికారి శాడిజం …జీతంలో కోత

Drukpadam

Leave a Comment