Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటలపై ఈగవాలితే చూస్తూ ఉరుకోము …కేసీఆర్ జాగ్రత్త :కిషన్ రెడ్డి హెచ్చరిక

ఈటలపై ఈగవాలితే చూస్తూ ఉరుకోము …కేసీఆర్ జాగ్రత్త :కిషన్ రెడ్డి హెచ్చరిక
-ఈటల వెనక మోదీ ఉన్నారని గుర్తు పెట్టుకో
-ఈటలను జైలుకు పంపే కుట్ర జరుగుతోంది
-ఆస్తులు పంచుకునే ఇద్దరు సీఎంలు జల వివాదాలను పరిష్కరించుకోరా?
-ఏపీ ప్రజలను రాక్షసులుగా చిత్రీకరించడం మంచిది కాదు
-కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు అది నిన్నటి పార్టీ అని ఎద్దేవా

హుజురాబాద్ ఎన్నిక టీఆర్ యస్ ,బీజేపీ లమధ్య కాక రేపుతోంది. బీజేపీ లో చేరిన ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని టీఆర్ యస్ చూస్తుండగా ఈటలపై ఈగవాలితే మోడీ చూస్తూ ఊరుకోరని బీజేపీ అంటుంది. ఇప్పటికే బీజేపీ ఇంచార్జిలను నియమించి హుజురాబాద్ లో ఎన్నకల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈటలపై ఆగ్రహంగా ఉన్న టీఆర్ యస్ జైలుకు పంపాలని చూస్తుందని స్వయంగా కేంద్రహోం మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ వెనక ప్రధాని మోదీ ఉన్నారని అన్నారు. ఈటలను ఏదో రకంగా జైలుకు పంపే కుట్ర జరుగుతోందన్నారు. ఆయన వెనక మోదీ ఉన్నారని, ఈటలను వేధిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కిషన్ ‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్ కు అలవాటని, ఆ తర్వాత అన్నీ మర్చిపోతారని కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై మాట్లాడుతూ.. ఆస్తులు పంచుకోవడంతోపాటు పార్టీలు చేసుకున్న కేసీఆర్, జగన్‌లు జలవివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. సీఎంల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో కానీ ఏపీ ప్రజలను రాక్షసులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉందన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ గురించి మర్చిపోండి అది నిన్నటి పార్టీ అని, దానికి భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు. హుజురాబాద్ లో గెలుపు ద్వారా తెలంగాణాలో బీజేపీ విజయానికి బాటలు వేయాలని అందుకు తగ్గట్లుగా ఇంచార్జిలకు సూచించారు .

 

Related posts

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. 62 మంది ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశం!

Drukpadam

కేటీఆర్ లండ‌న్ టూర్‌పై టీపీసీసీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌!

Drukpadam

కడప చేరుకున్న చంద్రబాబు.. పోటెత్తి వచ్చిన టీడీపీ శ్రేణులు

Drukpadam

Leave a Comment