Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి లక్ష్యంగా టీఆర్ యస్ మాటల దాడి…కాంగ్రెస్ ప్రతిదాడి !

గూండాయిజం చేస్తే లోపలకు పోతావ్: రేవంత్ రెడ్డికి సుధీర్ రెడ్డి వార్నింగ్
రేవంత్ రెడ్డి గూండా మాదిరి మాట్లాడుతున్నారు
ప్రచారం కోసం బజారు భాష వాడుతున్నారు
సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు మేమెప్పుడూ చెప్పలేదు
రేవంత్ రెడ్డి ఒక దొంగ… మంత్రి ప్రశాంత రెడ్డి
ఓటుకు నోటు కేసులో ఉన్న గజదొంగ
కేసీఆర్ నుంచి అధికారాన్ని తీసుకుంటానని అంటున్నారు
లాక్కుంటే అధికారం రాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది
రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు: మల్లు రవి
కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వాళ్లు విమర్శిస్తున్నారన్న మల్లు
వారంతా తిరిగి రావాలని పిలుపు
కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంటుందని వెల్లడి

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి, పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఇదే సమయంలో ఆయనపై టీఆర్ఎస్ నేతలు విమర్శలను ఎక్కుపెట్టారు. మరో అడుగు ముందుకేసి మంత్రి ప్రశాంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక దొంగ , ఓటుకు నోటు కేసులో ఉన్న గజదొంగ కేసీఆర్ దగ్గర నుంచి అధికారం లాక్కుంటానని అంటున్నారు. అధికారం లేకుంటే వచింది కాదు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుందని అన్నారు. దీనిపై మల్లు రవి స్పందించారు. రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు తగదని హితవు పలికారు .

సుదీర్ రెడ్డి ఎమ్మెల్యే …

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి గూండా మాదిరి మాట్లాడుతున్నారని… ఆయన ఇదే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని అన్నారు. ప్రచారం కోసం బజారు భాష మాట్లాడుతున్నారని… ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడరని చెప్పారు. గూండాయిజం చేస్తే లోపలకు పోతావ్ అని హెచ్చరించారు.

సీఎల్సీ అంటే తమ అబ్బ సొత్త కాదు, రేవంత్ అబ్బ సొత్తు కాదని సుధీర్ అన్నారు. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు తాము ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఒక గ్రూపు ఎమ్మెల్యేలం మాత్రమే టీఆర్ఎస్ లో విలీనమయ్యామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేరని విమర్శించారు. 2017లో రాజీనామా చేసినట్టు స్పీకర్ కు రేవంత్ రాజీనామా లేఖ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి ….

 

ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అధికారాన్ని లాక్కుంటామన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి… కేసీఆర్ నుంచి అధికారాన్ని తీసుకుంటానని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎవరో ఇస్తేనో, లేక లాక్కుంటేనో అధికారం రాదని… ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుందని అన్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ ఒక దొంగ అని వ్యాఖ్యానించారు.

మల్లు రవి కాంగ్రెస్ ….

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సీనియర్ నేత మల్లు రవి స్పందించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన వారు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆయా నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళతారేమోనన్న భయంతో అవాకులు, చెవాకులు మాట్లాడించారని మల్లు రవి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరిన వారు టీపీసీసీ అధ్యక్ష పదవి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంటుందని, ఒక నియంత పాలనలో బతకాల్సిన అవసరం లేదని మల్లు రవి పేర్కొన్నారు.

 

Related posts

ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం… వివరాలు తెలిపిన వైసీపీ, టీడీపీ ఎంపీలు

Drukpadam

ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరు… వారు ధనవంతులు కావడంలేదా?: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం!

Drukpadam

పంజాబ్​ సీఎం పదవి ఆఫర్​ ను తిరస్కరించిన కాంగ్రెస్​ సీనియర్​ మహిళా నేత.. సీఎం రేసులో సిద్ధూ!

Drukpadam

Leave a Comment