Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈ నెల 8 వైయస్ ఆర్ టి పీ ఆవిర్భావం …. జెండాని సైతం అరిష్కరించనున్న షర్మిల …

ఈ నెల 8 వైయస్ ఆర్ టి పీ ఆవిర్భావం …. జెండాని సైతం అరిష్కరించనున్న షర్మిల

తెలంగాణ మ్యాప్ మధ్యలో వైఎస్సార్ ఫొటో.. షర్మిల పార్టీ జెండా ఇదే!
ఈ నెల 8న పార్టీ ప్రకటన
అదే రోజు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు
అక్కడి నుంచి హైదరాబాద్‌కు
రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు

తెలంగాణ లో రాజన్న రాజ్యం తెస్తానంటున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే .అందులో భాగంగా ఆమె తెలంగాణాలో ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారు. నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఆమె ఫోకస్ పెట్టారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై స్పందించి ఇందిరాపార్క్ లో దీక్ష సైతం చేశారు. అక్కడ పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో లోటస్ పాండ్ లోని ఇంటివద్దనే దీక్షలు కూర్చున్నారు. పార్టీ ఏర్పాటుపై సుదీర్ఘ కసరత్తు చేశారు. జెండా ,ఎజెండాలను రూపొందించారు. ఖమ్మం లో జరిగిన బహిరంగ సభలోనే జులై 8 వైయస్ భర్త డే సందర్భంగా తెలంగాణాలో పార్టీ ఏర్పాటు ప్రకటన ఉంటుందని వెల్లడించారు. అనుకున్న ప్రకారం ఆమె జులై 8 న ప్రకటించబోతున్నారు. పార్టీ పేరును ఎన్నికల సంఘం దగ్గర వైయస్ ఆర్ టి పి రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి ఎన్నకల సంఘ నుంచి అనుమతి కూడా వచ్చింది. పార్టీ జెండా ను రూపొందించారు.

తెలంగాణలో పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ జెండా రెడీ అయింది పార్టీ ప్రకటన ,జెండా ఆవిష్కరణ కు ఏర్పాట్లు చేసుకున్నారు. . పాలపిట్ట, నీలం రంగులతో ఉన్న జెండా మధ్యలో తెలంగాణ రాష్ట్ర పటం, దాని మధ్యలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోతో జెండాను రూపొందించారు. షర్మిల ఎల్లుండి తన పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించనున్నారు. ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 8న సాయంత్రం జరగనున్న కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించనున్న షర్మిల.. పార్టీ జెండాను కూడా ఆవిష్కరిస్తారు.

షర్మిల 8న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ప్రత్యేక చాపర్‌లో హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఫిలింనగర్‌లోని సభా వేదికను చేరుకుని పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు హాజరుకానున్నారు.

Related posts

‘తన్నులాట’ గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు: రేవంత్‌రెడ్డి

Drukpadam

రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు యాత్రలా …సిగ్గుచేటు …సీఎల్పీ నేత భట్టి…

Ram Narayana

తెలంగాణ రాజకీయాల్లో నూతన పరిణామం!లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ !!

Drukpadam

Leave a Comment