Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు భట్టితో కలిసి జోడెడ్లలా పని చేస్తాం:రేవంత్

కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు భట్టితో కలిసి జోడెడ్లలా పని చేస్తాం:రేవంత్
-సీఎల్పీ నేత భట్టి ని కలిసిన నూతన పీసీసీ చీఫ్
-కలిసి పనిచేద్దామని ,సహకరించాలని విజ్ఞప్తి
-బాధ్యతల స్వీకార కారక్రమానికి రావాలని ఆహ్వానం
-కాంగ్రెస్ పార్టీ లో ఇక గ్రూపులు ఉండకుండా చేస్తా
-సమిష్టి నిర్ణయాలతో ముందుకు పోతాం
-శ్రీధర్ బాబు , జగ్గారెడ్డి ని కలిసిన రేవంత్
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య దీవెనలు అందుకున్న రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి కి సీనియర్ ల నుంచి ధిక్కార స్వరాలు వినిపించడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు సెక్సెస్ అయ్యాయి . ఇప్పటివరకు రేవంత్ కు కలిసేందుకు నిరాకరించిన సీనియర్లు మొత్తబడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు నడుచుకునేందుకు సిద్ధమైయ్యారు . ప్రధానంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ను హైకమాండ్ ఢిల్లీ కి సైతం పిలిచింది . ఆయనతో మాట్లాడింది . సీనియర్లలో కీలకంగా ఉన్న భట్టి ని , మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మరో సీనియర్ నేత రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మల్లు రవి రాయబారం ఫలించింది.

దీంతో రేవంత్ ఉత్తమ్ ,భట్టి ఇళ్లకు వెళ్లారు . వారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అందరం కలిసి పనిచేద్దామని వారిని రేవంత్ కోరారు . గాంధీ భావంలో జరిగే బాధ్యతల స్వీకారానికి రావాలని సీనియర్ అయిన ఉత్తమ్ , భట్టి ,శ్రీధర్ బాబు , జగ్గారెడ్డి , పొదెం వీరయ్య , జీవన్ రెడ్డి లను కలిశారు. ఒక్క కోమటి రెడ్డి బ్రదర్స్ మినహా అందరు కొంత మెత్త బడ్డారు. భట్టి కలిసిన సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ భట్టి తో కలిసి తిరిగి కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు జోడెడ్లలా పని చేస్తామని అన్నారు. సమిష్టి నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకోని వచ్చేందుకు శాయశక్తులా పని చేస్తానని అన్నారు. అందరిని కలుపుకుని పోవడమే తనముందున్న ఏకైక ఎజెండా అని అన్నారు. భట్టి మాట్లాడుతూ నూతన అధ్యక్షుడు రేవంత్ కు ఇతర ఆఫీస్ బేరర్లను అభినందించారు.

రేవంత్ బాధ్యతల స్వీకారానికి ముస్తాబైన గాంధీ భవన్

నూతన పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ ఈ సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో భాద్యతలు స్వీకరించనున్నదున మూడు రంగుల జెండాలతో ముస్తాము చేశారు. చిన్న చిన్న వాస్తు దోషాలను కూడా సరి చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యలను మంత్రినే గాంధీ భవన్ ప్రాగణంలోకి అనుమతించనున్నారు.

మల్లి ఖార్జున ఖర్గే , డీకే శివకుమార్ , పంజాబ్ ఎంపీ బిట్టు , తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ , బోసు రాజు ,శ్రీనివాసన్ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తుంది.

Related posts

రాజకీయాలు అంటే డబ్బు పదవులు కాదు….తమ్మినేని

Drukpadam

ఢిల్లీ సరిహద్దులలో రైతు ఉద్యమం పై పోలిసుల జులుం…

Drukpadam

న్యాయం గెలిచింది… న్యాయమే గెలుస్తుంది: చంద్రబాబు

Drukpadam

Leave a Comment