Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ మరింత ముమ్మరం చేయాలి :పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ మరింత ముమ్మరం చేయాలి :పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్
-ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి
-పాత నేరగాళ్లు క్రిమినల్ గ్యాంగులపై కదలికలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలి
-పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా మెలగాలి
-ఖమ్మం టూ టౌన్ ,ఆర్భన్ పోలీస్ స్టేషన్లు, టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ మరింత ముమ్మరం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఖమ్మం టూ టౌన్ ,ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్లు, ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..నేరం జరిగిన తర్వాత స్పందించే కంటే ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలన్నారు. క్రిమినల్ గ్యాంగ్ ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా మెలగాలని, ప్రతిఒక్కరికి జవాబుదారీగా వుండాలని సూచించారు.

రిసెప్షన్ సిబ్బంది విధులు ఏవిధంగా నిర్వర్తిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. రిసెప్షన్ రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమీక్షించారు. పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా వుంచాలని అదేవిధంగా అవసరమైన రికార్డులు,
వస్తువుల క్రమపద్ధతిలో పెట్టడం,పరిసరాలలో సురక్షితమైన ,ఆరోగ్యవంత మైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొవాలన్నారు. అప్పగించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని
అన్నారు. స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, యూనిఫాం మరియు హెల్మెట్ ధరించడం, రెగ్యులర్ రోల్ కాల్ మరియు వీక్లీ పరేడ్ గురించి సిబ్బంది అధికారులు విధిగా అమలు చేయాలని సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు.
పెట్రో కార్ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? బీట్ డ్యూటీ సిబ్బంది ట్యాబ్ ద్వారా క్రైమ్ ప్రొ ఏరియాను ఏవిధంగా గుర్తిస్తున్నారు? జియో ట్యాగ్‌ ద్వారా పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో ట్యాబ్ ద్వారా చూపించాలని ఆదేశించారు.
స్టేషన్ ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను స్ధానికులు వివరించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు పెట్టుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

 

 

 

తె

Related posts

హైద్రాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం…కట్టుతప్పితే కఠినంగా ఫైన్ !

Drukpadam

ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనేదానిపై ప్రభుత్వాలకు ఏంపని …హిజాబ్ పై కేసీఆర్!

Drukpadam

జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు బీభత్సం.. రెండున్నర నెలల పసికందు మృతి

Drukpadam

Leave a Comment